కష్టకాలంలో ప్రజలకు అండగా సీఎం వైయస్‌ జగన్‌  

కరోనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తోంది

కరోనా కేసులు పెరగాలన్నదే చంద్రబాబు ఆలోచన

ఇంట్లో టైంపాస్‌ కాక చంద్రబాబు లేఖలు రాస్తున్నారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: లాక్‌డౌన నేపథ్యంలో ప్రజలంతా కష్టాల్లో ఉంటే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా నిలిచారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇంట్లో టైంపాస్‌ కాక లేఖలు రాస్తున్నారని విమర్శించారు. మంగళవారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుందన్నారు. కరోనాపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.హైదరాబాద్‌లో కూర్చొని డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా కేసులు పెరగాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందన్నారు.ఇంట్లో టైం పాస్‌ కాక ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని పేర్కొన్నారు.విశాఖ ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు.సమస్యలు పరిష్కరిస్తుంటే చంద్రబాబు బాధపడుతున్నారన్నారు.
 

Back to Top