వరదల్లో బాబు  బురద రాజకీయం

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి  

 అసెంబ్లీ సమావేశాల నుంచి పలాయనం చిత్తగించి ప్రభుత్వంపై బురదజల్లడం దురదృష్టకరం

 అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, విద్య, వైద్యం, మహిళా సాధికారతపై సుదీర్ఘంగా చర్చ

 అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన ప్రధాన అంశాలపై బాబు వీడియోలు తెప్పించుకునైనా చూడాలి

 రాజకీయంగా శూన్యమై... గాల్లో కలిసిపోతారని సీఎం గురించి బాబు మాట్లాడటం దౌర్భాగ్యం

అమ‌రావ‌తి:  వరదల్లో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చేసిన బురద రాజకీయాన్ని ప్ర‌జ‌లు అసహ్యించుకుంటున్నార‌ని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు.  అసెంబ్లీ సమావేశాల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం నుంచి మహిళా సాధికారత, రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వ సహాయ చర్యలు, విద్య, వైద్యం తదితర అంశాలతోపాటు, బీఏసీ సమావేశంలో టీడీపీ లేవనెత్తిన  ప్రతి అంశంపైనా అసెంబ్లీ సుదీర్ఘగా చర్చ జరిగింద‌న్నారు.  మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రధానమైన అంశాలపై సమాధానం ఇచ్చారు. 93 మంది సభ్యులు ఈ సమావేశాల్లో మాట్లాడారు. 7 రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో 34 గంటలకు పైగా చర్చ జరిగినట్టు రికార్డు అయ్యిందని చెప్పారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించి జరిగిన ముఖ్యమైన చర్చలో పాల్గొనకకుండా, పలాయనం చిత్తగించి, బయటకు వెళ్ళి ప్రభుత్వంపై బురదజల్లటం దురదృష్టకరం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళలకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అన్నీ మీరు చేసి, మాపై నిందలు వేయటం మానుకోవాలి. టీడీపీ హయాంలో మహిళలను మీరు ఏ విధంగా అవమానించారో వీడియోలతో సహా రాష్ట్ర ప్రజలు చూశారు, రాజకీయంగా మీరు శూన్యం అయిపోయి..  ముఖ్యమంత్రి జగన్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, గాల్లో కలిసిపోతారు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడటం దౌర్భాగ్యం..

  వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అక్కడకు వెళ్ళి బాధితులను ఓదార్చకుండా.. నన్ను ఓదార్చండి అంటూ సింపతీ మాటలు మాట్లాడటం, శాసనసభలోగానీ, బయటగానీ మేము ఎవరం అనని మాటలను అన్నట్టుగా దుష్ప్రచారం చేయడం ఆయనకే చెల్లింది. దయవుంచి ఇప్పటికైనా చంద్రబాబు మైండ్ సెట్ ను మార్చుకోవాలి. 

  కుంటి సాకులతో అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన అంశాలపై, వీడియోలు తెప్పించుకుని అయినా చూడాలి. అప్పుడైనా ఆయనకు కాస్త జ్ఞానోదయం కలుగుతుంది.  ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 25 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం. సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన బీఏసీ సమావేశంలో.. టీడీపీ అడిగిన అంశాలు అన్నింటినీ చర్చిస్తామంటే... వాళ్ళే పారిపోయారు. సమావేశాలు ఎక్కువ రోజులు జరిపించండి అని టీడీపీ నేతలు మొక్కుబడిగా అడిగినా.. మేం ఒప్పుకుంటే, చివరికి వారే షాక్ కు గురై, కుంటిసాకులు చెప్పి సానుభూతి కోసం బయటకు వెళ్ళి డ్రామాలు చేశారు.  ఇంతగా దిగజారాల్సిన అవసరం ప్రతిపక్ష నేతకు ఎందుకు వచ్చిందని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

 ఈ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదు. చంద్రబాబు, టీడీపీ సభ్యులే పదే పదే అవమానించే రీతిలో మాట్లాడారు. ఆరోజు కూడా చంద్రబాబే, సభలో బాబాయి-గొడ్డలి, తల్లి- చెల్లి అని ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రజల గురించి చర్చించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలు కాకుండా సభను పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.  వారి ఆటలు సాగకపోవడంతో.. బయటకు వెళ్ళి ప్రభుత్వంపైన రోజూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు, అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను ఏమార్చలేరు, ఇకనైనా మారండి అని హితవు చెబుతున్నాం. 

 మహిళా సాధికారత, విద్య, బడుగు, బలహీన వర్గాలపై జరిగిన సుదీర్ఘమైన చర్చ చరిత్రలో మిగిలిపోతుంది. వరదలపై ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన ఇచ్చారు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేస్తున్నారు. వరదలు- ప్రభుత్వ సాయానికి సంబంధించి టీడీపీకి వత్తాసు పలికే పత్రికల్లో రాసిన రాతలతో సహా వాస్తవాలను ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను గుర్తెరిగితే మంచిది. 

 నెల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ..  ఓ పాకలో దూరి, ప్రభుత్వ సాయం అందిందా అని అడిగితే... అన్నీ అందినట్టుగా బాధితులు చెప్పి, చూపించారు. చేతనైతే సాయం చేయాలి గానీ.. బాధితుల దగ్గరకు వెళ్ళి రాజకీయాలు చేస్తే బూమరాంగ్ అవుతుందని చంద్రబాబు తెలుసుకోవాల‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు.

Back to Top