సీఎం వైయస్‌ జగన్‌తో ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తల బృందం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తల బృందం కలిసింది. రెండు రోజుల పర్యటనలో ఏపీకి వచ్చిన 13 మంది ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తల బృందం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యింది. వీరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. పెట్టుబడుల అనుకూలతను మంత్రులు, అధికారులు శాస్త్రవేత్తల బృందానికి వివరించారు.డెయిరీ, ఆటో మొబైల్‌, ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ఆటోమేషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదిరత రంగాల్లో ఫ్రెంచ్‌ బృందం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Back to Top