మోసపు మాటలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు

  మీడియా స‌మావేశంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి 

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు కోనసీమ పర్యటన: ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజం.

ముఖ్యమంత్రిస్ధాయి వ్యక్తి హుందాగా మాట్లాడాలి.

మోసపు మాటలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు.

గ్రామసభలు గతంలోనూ జరిగాయి.

తానే కొత్తగా కనిపెట్టినట్లు చెప్పడం విడ్డూరం.

మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.

రావులపాలెం: వైయస్.జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోనసీమ జిల్లా వానపల్లి గ్రామపర్యటన కొనసాగిందే తప్ప.. గ్రామ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలేవీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తన మాటలతో మరొక్కసారి చంద్రబాబు ప్రజలను  మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్న జగ్గిరెడ్డి.. గ్రామసభలు గతంలోనూ జరిగాయని..  ఇవాల వాటిని  తాను కొత్తగా కనిపెట్టునట్టు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రావులపాలెం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రజలు మేలు చేసే ఒక్క ప్రకటన గ్రామసభలో లేకపోవడం నియోజకవర్గ ప్రజలను నిరాశపర్చిందని తేల్చి చెప్పారు. 
చంద్రబాబు తన మాటల గారడీతో ప్రజలను మోసం చేశారన్న జగ్గిరెడ్డి… వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగలేదన్న బాబు మాటలను ఖండించారు.
వానపల్లి గ్రామంలో అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ.5 కోట్లు తల్లులకు అందించి సాయం చేసినందుకా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నిందిస్తున్నారని నిలదీశారు. అదే గ్రామంలో రైతుభరోసా ద్వారా రూ.5.30 కోట్లు, ఆసరా ద్వారా రూ.6.30 కోట్లు అందించామన్నారు. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.42 కోట్లు అందించామన్నారు.
చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేసిన ఫలాలమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి  మంజూరు చేసిన రూ. 1.6 కోట్లు నిధులతోనే.. ఆలయ ప్రాకార మండపం నిర్మించామని జగ్గిరెడ్డి స్పష్టం చేసారు. 
99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసింది వైయస్ఆర్‌ కాంగ్రెస్ మాత్రమేనని తేల్చే చెప్పారు. 
రెండేళ్లు కరోనా మహమ్మూరి ఉన్నా… దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన వ్యక్తి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి మాత్రమేనన్నారు.
దివంగత ఎన్టీఆర్ పేరు చెప్పితే తప్ప ప్రజలను ఓట్లడగలేని చంద్రబాబుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే తప్ప ఆయన కుమారుడు లోకేష్ ను ఈ రాష్ట్రంలో ఐదుపైసలకు కూడా కొరగాడన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి స్దాయిలో వ్యక్తి హుందాగా మాట్లాడాలే తప్ప… నోటికొచ్చినట్లు మాట్లాడ్డం సరికాదన్నారు. కోనసీమ జిల్లాల్లో అవసరమైన బ్రిడ్జిలు వంటి మౌలిక  సౌకర్యాలపై ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తుందని ఆశపడ్డ కొత్తపేట ప్రజలకు నిన్నటి చంద్రబాబు పర్యటన నిరాశే మిగిల్చిందన్నారు.. 
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు మాని…  ప్రజలకిచ్చిన అమలుచేయడంపై  దృష్టి పెట్టాలని సూచించారు.

Back to Top