రైతుల కల్లాల్లో ధాన్యం- కళ్లళ్లో దైన్యం

అన్నదాతల పాలిట శాపంగా మారిన చంద్రబాబు ప్రభుత్వం

ధాన్యం సహా ఏ పంటకూ మద్ధతు ధర కల్పించని దయనీయం

ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు

తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.

మీరు చేస్తున్నది 'రైతన్నా మీ కోసం' కాదు

రైతన్న మోసం కార్యక్రమం

రైతులే లేని రైతన్నా మీకోసం కార్యక్రమం

పచ్చ కండవాలు కప్పుకున్న అధికార పార్టీ కార్యకర్తలతో నిర్వహణ

సినిమా షూటింగ్ మాదిరిగా చంద్రబాబు కార్యక్రమం 

తీవ్రంగా ఆక్షేపించిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

మంత్రులు నేరుగా రైతులను ఎందుకు కలవడం లేదు?

కోట్ల రూపాయలతో ప్రచారమే పరమావధి

రైతుల కోసం ఒక్క సమీక్షా నిర్వహించని నిర్లక్ష్య ప్రభుత్వం

అన్నదాత కాడె వదిలేసే దుస్థితికి తెచ్చిన చంద్రబాబు

ఆగ్రహం వ్యక్తం చేసిన కారుమూరి నాగేశ్వరరావు

తాడేపల్లి: పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. రైతుల కల్లాల్లో ధాన్యం- కళ్లళ్లో దైన్యం తప్ప మరేమీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తుంది  రైతన్నా మీ కోసం కార్యక్రమం కాదని.. అది రైతన్న మోసం కార్యక్రమమని మండిపడ్డారు. రైతులే లేకుండా అధికార పార్టీ కార్యకర్తలకే పచ్చ కండువాలు కప్పి..  ప్రచారం కోసం  కోట్లాది రూపాయల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. వైయస్.జగన్ ప్రభుత్వంలో ధాన్యానికి మద్ధతు ధరతో పాటు గనీ బ్యాగులు, రవాణా ఖర్చులు కూడా అందించి అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేసారు.  కూటమి ప్రభుత్వంలో రూ.1700 ఉండాల్సిన ధాన్యం గిట్టుబాటు ధర లేక రైతులు రూ.1200కే దళారులకు  అమ్ముకుంటున్నారని.. ఇలాగే కొనసాగితే అన్నదాతలు కాడె వదిలిపెట్టడం ఖాయమని హెచ్చరించారు.  తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్ధతు ధర కల్పించడంతో పాటు, రానున్న సీజన్ లో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

● చంద్రబాబు ప్రభుత్వం - రైతుల పాలిట శాపం..

కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది.  కల్లాల్లో ధాన్యం, రైతుల కళ్లల్లో దైన్యం తప్ప మరేం కనబడ్డం లేదు. రైతుల పట్ల అత్యంత అన్యాయంగా ప్రవర్తిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రచార పర్వం తప్ప మరేం లేదు. రైతుల ధాన్యం కల్లాల్లో, రోడ్ల మీద గిట్టుబాటు రేటు లేక అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్న పరిస్థితి. దళారులదే రాజ్యంగా తయారైంది. రూ.1770 గిట్టుబాటు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1200, రూ.1300 కే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. కనీసం రైతుల సమస్యలపట్ల ప్రభుత్వం ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు. వ్యవసాయ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రులు కనీసం రైతులను పరామర్శించిన పాపాప కూడా పోలేదు.

● రైతులకు మొండిచేయి- ప్రచారం కోసం కోట్ల ఖర్చు...

వైయస్.జగన్ హయాంలో ఇ-క్రాప్ చేసి, ఇన్సూరెన్స్ కట్టడంతో పాటు సున్నావడ్డీకే రుణాలిచ్చి రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నారు. పంట రాకుండా నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ కూడా వైయస్.జగన్ ప్రభుత్వంలో అందించారు. ఇవాళ మొంధా, ద్విత్యా తుపాన్ ప్రభావంతో రైతులు రోడ్డున పడ్డా వారిని ఆదుకోవడం లేదు కానీ.. రైతన్నా నీ కోసం అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
మీరు ఏ రైతు దగ్గరకు వెళ్లారు? కేవలం ఫంక్షన్ హాళ్లలో సమావేశాలు పెట్టి ప్రసంగాలు ఇవ్వడం మినహా.. .ఎవరైనా రైతుల కళ్లాల దగ్గరకు గానీ, పొలాలు దగ్గరకు కానీ వెళ్లారా? ప్రత్తి, మామిడి, అరటి, ఉల్లి, కందులు ఇలా ఏ పంటకూ మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మీ హెరిటేజ్ షాపుల్లో అరటిపండు రూ.50 పైసలకు అమ్మతారా? రైతు పండించిన పంట కిలో అరటి రూ.50 పైసలకు కూడా కొనలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 
గతంలో వైయస్.జగన్ ప్రభుత్వంలో అరటి రైతులకు అండగా నిలబడి వారికి తగిన మద్ధతు ధర కల్పించానికి ప్రభుత్వమే అరటి పంటను కొని పశ్చిమ బెంగాల్ కు ప్రత్యేక రైలులో తరలించారు. మీరు మాత్రం మీ కోసం రైతన్నా అంటూ అబద్దాలు చెబుతున్నారు. నల్లజర్ల వెళ్లిన చంద్రబాబు అక్కడ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఒంగోలు, తిరుపతి వెళ్లి  రైతులకు ఏం చేస్తారో చెప్పండి. మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు ఇస్తున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ ఏమీ ప్రకటించలేదు. నష్టపరిహారం ఏమిస్తారు? రైతులు తడిసిన ధాన్యంతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు. వాళ్ల బాధ వర్ణణాతీతం. ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు చేస్తున్న కార్యక్రమం రైతన్నా మీ కోసం కాదు, రైతన్న మోసం కార్యక్రమం. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రచారం చేసుకుంటున్న మీరు మీ ప్రచారానికి పెట్టిన ఖర్చు రైతులకిచ్చినా మేలు జరిగి ఉండేది. మీ నాయకులు, కార్యకర్తలకే పచ్చకండవాలు వేసి కూర్చొబెట్టి ఉపన్యాసాలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతు అలో లక్ష్మణా అని బోరున విలపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో వర్షాలతో పంటలు దెబ్బతింటే మీరు ఎందుకు వారి గురించి మాటలాడ్డం లేదు? 

● రైతుల పంటలకు ధరలేదు - ప్రభుత్వ అప్పుకు లెక్కా లేదు?

రైతు పంట అమ్ముతామనకుంటే అరటి కిలో రూ.50 పైసలు, ప్రజలు కొనుగోలు చేయాలనుకుంటే కిలో రూ.50 ఉంది. అంటే ఎవరి పాలవుతుంది ఇదంతా? మధ్యలో ఉన్న దళారులు లాభపడుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ.600 కోట్ల పాత బాకీ ఇంకా చెల్లించలేదు. తుపాన్ లో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. బీడులుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రాను రైస్ బౌల్ అన్నది ఒకప్పటి మాటగా మిగిలిపోయింది. రైతు కాడె పక్కనపెడితే అందరి పరిస్థితి ఏంటన్నది ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. రైతులకు అనేక హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం... ఒక్కదాన్నీ నెరవేర్చలేదు సరికదా సంపదసృష్టి పోరుతో రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసి రైతులకు ఏం మేలు చేశారు? ప్రజలకేం చేశారు? 
మామిడి, కోకో, చీనీ, పత్తి, అపరాలు, ధాన్యం ఇలా ప్రతి పంట పండించిన రైతు మద్ధతు ధర లేక కుదేలవుతున్నారు. ధాన్యం రైతుకు అయితే మద్ధతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్ధితిలో ఉన్నారు. ఇదే వైయస్.జగన్ ప్రభుత్వంలో ధాన్యానికి మద్ధతు ధర ప్రకటించడంతో పాటు గినీ బ్యాగుల ఖర్చు, హమాలీల కూలీ, రవాణా వీటన్నింటికీ డబ్బులిస్తే... వీటన్నింటికీ కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. కేవలం సినిమా స్టైల్లో ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమీ లేదని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.  వీలైనంత వేగంగా ప్రభుత్వం రైతులను ఆదుకోవడంతోపాటు, రాబోయే సీజన్ లో పంటలకు పెట్టుబడి సాయంతో పాటు, ఎరువులు కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. 

● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

నోటిఫికేషన్ వచ్చేనాటికి మా హయాంలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ధాన్యం సేకరణ డబ్బులు చెల్లించాం. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నష్టపోయిన పంటను కాపాడుకునే పనిలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ సరైన సమయంలో రైతులు కచ్చితంగా బయటకు వస్తారు. 
తుపాన్ ల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది.  కేవలం రైతన్నా మీ కోసం అని సమావేశాలు పెట్టి.. పేపర్లు పంచడం మినహా రూపాయి సాయం చేయలేదు.

ఓన్ జీసీ డ్రెడ్జింగ్ వల్ల నేల కుంగి కొబ్బరి చెట్లు నేలకూలుతున్నాయి తప్ప.. మరో కారణం కాదు. ఉప ముఖ్యమంత్రిగా రైతులు నష్టపరిహారం ఇప్పించే పనిచేయాలే తప్ప... అనవసరమైన మాటలు మాట్లాడ్డం వృధా. కేవలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రైతుల తరపున ముఖ్యమంత్రి, అధికారులతో మాట్లాడి కొంత పరిహారం ఇప్పించాం. మీరు ఉపముఖ్యమంత్రి అది కూడా చేయలేరా?  ప్రభుత్వం ఇ-క్రాప్ చేయకుండా ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్లే వారికి పంట నష్టపరిహారం రాలేదు. దానిగురించి మాత్రం ఎందుకు మాట్లాడ్డం లేదు? అని నిలదీశారు.

Back to Top