చంద్రబాబుకు పెత్తందార్లకు కొమ్ముకాసే వ్యాధి పట్టుకుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: ఎల్లో మీడియాను చూసుకొని టీడీపీ నేతలు బలుపుతో ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ రోడ్లమీద పడి తిరుగుతున్నా.. ప్రజలు అసలు వారిని పట్టించుకోవడం లేదన్నారు. కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఇంటి ముద్దబిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబుకు పెత్తందార్లకు కొమ్ముకాసే వ్యాధి పట్టుకుందని, తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలని వ్యాధి కూడా సోకిందని, ఈ వ్యాధులతోనే అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకున్నాడన్నారు. చంద్రబాబు దోపిడీని గమనించిన ప్రజలు గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారన్నారు.
 

Back to Top