చంద్రబాబును అరెస్ట్‌ చేయక ముద్దు పెట్టుకుంటారా? 

మాజీ మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ‌: అవినీతి పనులు చేసే చంద్రబాబును అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా..? అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరు? అని నిలదీశారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయమా..? పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు.. దోచుకున్న న‌ల్ల‌ డబ్బును వైట్ చేసేందుకే.. చంద్రబాబు పాల వ్యాపారం పెట్టారని ఆరోపించారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు చెప్పాలి.. చంద్రబాబులా సెల్ఫీలు తీసుకొని చెప్పుకోవడమెంటో..! అంటూ ఎద్దేవా చేశారు. 

హైదరాబాద్ తానే కట్టననే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ రాదు అని కొడాలి నాని దుయ్యబట్టారు. పిట్టల దొర లేని లోటుని ఆయన తీరుస్తున్నాడు అని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top