తాడేపల్లి: చంద్రబాబును పిచ్చాస్పత్రిలోనైనా చేర్చాలి.. లేదా జైల్లో అయినా పెట్టాలి. లేకపోతే రామ్మూర్తి నాయుడిని బంధించినట్టు చంద్రబాబును కూడా రూమ్‌లో బంధించకపోతే ప్రజానీకానికి, చంద్రబాబుకూ ఇబ్బందులు వస్తాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే జనమే బాబును కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. రెండు గ్లాసులు, నాలుగు కుర్చీలు, ఒక కంప్యూటర్ ధ్వంసమైనందుకు పరామర్శకు చంద్రబాబు గన్నవరం వెళ్లాడని, అక్కడకు వెళ్లి పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌లు విసురుతున్నాడని మండిపడ్డారు. పోలీసుల భద్రత లేకుండా కాలు కూడా కదపలేని చంద్రబాబు.. గన్నవరం వెళ్లి పోలీసు అధికారులను నోటికి వచ్చినట్టుగా తిడుతున్నాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
``గన్నవరం వెళ్లి ఒక్కొక్కడి అంతు తేలుస్తా.. అని చంద్రబాబు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. మెంటల్ ఆస్పత్రి నుంచి తప్పించుకొని ఇక్కడకు వచ్చాడని ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. చంద్రబాబును పిచ్చాస్పత్రిలో గానీ, జైల్లో గానీ పెట్టాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ మీద ప్రమాణం చేసి, రాజ్యాంగాన్ని, శాంతిభద్రతలను కాపాడుతాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తానని ప్రమాణం చేశాడు. ప్రతిపక్ష నేతగా క్యాబినెట్‌ర్యాంక్ తీసుకున్న రోజు రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానని ప్రమాణం చేశాడు. చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాడు. నీచపు మాటలు మాట్లాడుతున్నాడు. లోకేష్ ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌లు విసిరితే బ్రెయిన్‌లెస్ కిడ్ అనుకోవచ్చు.. 76 ఏళ్ల వయసులో కొట్టుకుందాం పోలీసులు లేకుండా రా అని ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌లు విసురుతున్నాడు.
చంద్రబాబు పిచ్చి ఛాలెంజ్‌లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించడు. సీఎం వైయస్ జగన్ రాజ్యాంగ మీద, ప్రజల మీద, రాష్ట్రం మీద, దేవుడి మీద నమ్మకంతో పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. బ్లాక్ క్యాట్స్ వద్దని కేంద్రానికి లేక రాయాలి. నేను, వంశీ ఇద్దరిలో ఒకరం మాకున్న సెక్యూరిటీని వదిలేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాం.. చంద్రబాబు ఎక్కడకు రమ్మంటే అక్కడికి వస్తాం. నల్లమల ఫారెస్టా..? లేక మచిలీపట్నం వద్ద సముద్రంలో 20 కిలోమీటర్లు వెళ్లిన తరువాత పడవల్లో కొట్టుకుందామా..? ఛత్తీస్‌గడ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా..? నీతోపాటు లోకేష్‌ను, ముసలి రౌడీలు ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వారి కూడా తీసుకురా.. ఒక్క దెబ్బతో దరిద్రం వదిలిపోతుంది. ఒక బ్యాచ్ పైకి, మరో బ్యాచ్ జైలుకు పోతుంది. రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం విరగడైపోతుంది.
చంద్రబాబు మైండు ఉండే మాట్లాడుతున్నాడా..? రెండు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉండి బాలకృష్ణ సినిమాలు చూస్తున్నట్టున్నాడు. బాలయ్య చంద్రబాబు మీద పూనినట్టున్నాడు. ఆయన సినిమాల్లో చెబుతుంటే.. చంద్రబాబు మైక్‌ల ముందు డైలాగ్‌లు చెబుతున్నాడు. వయసు వచ్చినా బుద్ధిలేకుండా పిచ్చివాగుడు వాగుతున్నాడు. బాబు పిచ్చిమాటలకు తమ్ముళ్లు రెచ్చిపోయి పోలీసులను, ప్రెస్ వాళ్లను ఎవరు అడ్డం వస్తే వారిని కొడుతున్నారు.
పిచ్చి మాటలు మాట్లాడే చంద్రబాబును 2024 ఎన్నికలు అయ్యేలోపు అమరావతిలో నారా చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రం కట్టి, దానికి పసుపు రంగు వేసి, 6, 7 రూములు కట్టి 420 బ్యాచ్‌ను మంచి మంచి సూట్ రూమ్‌లో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తరువాత ఇంకా జనం మీద పడి ఎందుకు ఓటు వేయలేదని జనాన్ని కొడతారు. రాష్ట్ర ప్రజలు గమనించాలి.. గన్నవరానికి పట్టాభిని పంపించింది చంద్రబాబే. ఆ ఘటనలో టీడీపీ, వైయస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు. ఇరు పార్టీలను కంట్రోల్ చేసిన పోలీసులకే దెబ్బలు తగిలాయి. సీఐ ఇంకా ఐసీయూలో ఉన్నారు. పోలీసుల భద్రత లేకుండా అడుగు కూడా వేయలేని చంద్రబాబు.. ఆ పోలీసులనే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పోలీసులకు మతం రంగు అంటగడుతున్నాడు. 76 ఏళ్ల వయసు వచ్చినా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ``