చంద్రబాబుకు ఆల్‌రెడీ మోత మోగింది

మాజీ మంత్రి కన్నబాబు

కాకినాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2019లో ఆల్‌రెడీ ప్రజలు మోత మోగించారని  మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.  చంద్రబాబు హయాంలో కాపులు కంచాల మోత మోగించారని, గతంలో కాపు ఉద్యమంలో నిరసన తెలిపితే అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను సీఎం వైయస్‌ జగన్‌ మాఫీ చేశారని తెలిపారు. కాపులు కంచాలు కొడితే తప్పని టీడీపీ నేతలే చెప్పారన్నారు. ఇవాళ టీడీపీ వాళ్లు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే నన్ను కలవనివ్వరా అని లోకేష్‌ అంటున్నారు. ఆనాడు ముద్రగడను అరెస్టు చేస్తే ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ రాష్ట్రమంతా మోతెక్కిపోతుందని కన్నబాబు ఎద్దేవా చేశారు.
 

Back to Top