వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదుల‌పై స్పందించ‌రేం? 

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు:  వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదుల‌పై పోలీసులు స్పందించ‌డం లేద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ అధినేత‌,  మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఫొటోల‌ను లోకేశ్ ఆధ్వ‌ర్యంలో మార్ఫింగ్ చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ సోష‌ల్ మీడియాలో త‌మ‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై ప‌ట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. త‌న కుటుంబ స‌భ్యుల‌పై కూడా టీడీపీ సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టిన‌ట్టు అంబ‌టి పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకునే దిక్కు లేద‌న్నారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతామ‌ని అంబ‌టి రాంబాబు తెలిపారు.

Back to Top