ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసుల‌పై కేసులు వేస్తాం

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 

గుంటూరు: రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, అలాంటి వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు,  మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై న‌మోదు చేస్తున్న అక్ర‌మ కేసులు, అరెస్టుల‌పై అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వందకు పైగా కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. మా వాళ్ల‌ను అరెస్టు చేశారు మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియా వాళ్లు చాలా దారుణంగా  వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌పై,  నాయకులపై దారుణంగా పోస్టులు పెట్టారు. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేద‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. 

Back to Top