సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ సీపీఎం మాజీ ఎమ్మెల్యే 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో సీపీఎం సీనియ‌ర్ నాయ‌కులు,  కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే  పాటూరు రామయ్య మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో పాటూరు రామ‌య్య సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైయ‌స్ జ‌గ‌న్ అడిగి తెలుసుకున్నారు.  

Back to Top