వీసీల‌ను భయపెట్టి రిజైన్ చేయించ‌డం సమంజసం కాదు

మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌

విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు

వైయ‌స్ జగన్ సెక్యూరిటీపై బురదచల్లుతున్నారు

వైయ‌స్‌ఆర్‌ విగ్రహం తగలబెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

గుంటూరు: యూనివర్శిటీలలో వీసీలను భ‌య‌పెట్టి బలవంతపు రాజీనామాలు చేయించ‌డం స‌మంజ‌సం కాద‌ని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై గుంటూరులోని తన నివాసంలో  మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు.

మేరుగు నాగార్జున ఏమ‌న్నారంటే..
వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరం, నేను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశాను.
ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం

గతంలో టీడీపీ అపాయింట్‌ చేసిన వీసీలను వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొనసాగించింది, విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు, ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్‌ చేయడం సమంజసం కాదు

గవర్నర్ వీసీని అపాయింట్‌ చేస్తారు, ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు, అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా

ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్‌ చేసిన వారిని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి, మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి.

వైయ‌స్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు, మేం ఎప్పుడూ ఇలా చేయలేదు, మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం, మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు

వేమూరు నియోజకవర్గంలో దివంగత వైయ‌స్‌ఆర్‌ విగ్రహాన్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టారు, ఇంత అన్యాయమా, పోలీస్‌ వ్యవస్ధ ఏం చేస్తుంది, మేము ఎప్పుడైనా ఇలా చేశామా, ఇంత పైశాచికమా, కచ్చితంగా ప్రజలే తిరగబడతారు, ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ ఇకనైనా ఆలోచించండి, విగ్రహాల జోలికెళ్ళవద్దు, ప్రజాస్వామ్యం ఎటు వెళుతుందన్న బాధ కలుగుతుంది, వైయ‌స్‌ఆర్‌ విగ్రహం తగలబెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, ఒక్క వైయ‌స్‌ఆర్‌ విగ్రహమే కాదు ఎవరి విగ్రహమైనా ఇలా చేయడం సబబు కాద‌ని మేరుగు నాగార్జున అన్నారు.

Back to Top