నిబంధనల మేరకే వైయస్‌ జగన్‌కు ములాఖాత్‌కు అనుమతి  

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: నిబంధనల మేరకే వైయస్‌ జగన్‌కు ములాఖాత్‌కు అనుమతి ఇచ్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి చెప్పారు. వైయస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని జైల్‌లో వైయస్‌ జగన్‌ పరామర్శించడాన్ని కొన్ని ఛానళ్లు చేసిన ఆసత్య ప్రచారాన్ని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం నెల్లూరులో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలతో కలిసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ పర్యటనతో వైయస్‌ఆర్‌సీపీకి పేరొస్తుందని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పాలని చూశారన్నారు.  వైయస్‌ జగన్‌ పట్ల ప్రభుత్వం ఎక్కడా ఉదారంగా వ్యవహరించలేదన్నారు. అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రసారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెళ్లి వ్యవహారంలోనూ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
 

Back to Top