స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో టీడీపీ నేతల భారీ దోపిడీ

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారని తెలిపారు. గుజరాత్‌ మోడల్‌ అని అబద్దాలు చెప్పి స్కాం చేశారని పేర్కొన్నారు. సెమెన్స్‌ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు రిలీజ్‌ చేశారని విమర్శించారు. గంటా సుబ్బారావు, సుమన్‌ బోస్‌ మధ్య ఈ ఒప్పందం జరిగిందని తెలిపారు. సుమన్‌ బోస్‌కి, సిమెన్స్‌ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా సిమెన్స్‌ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారని తెలిపారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపిన చంద్రబాబు చెప్పినందుకే డబ్బులు రిలీజ్‌ చేశారని వివరించారు. డిజైన్‌టెక్‌ వాళ్లు చెప్పినట్లుగానే ఎంవోయూ చేసుకున్నారని చెప్పారు. జీవోలో ఉన్న అంశాలు ఎంవోయూలో లేవన్నారు. ఎలాంటి టెండర్‌ కూడా లేకుండా ప్రాజెక్టుకు ప్లాన్‌ చేశారన్నారు. సుమన్‌ బోస్‌కు సిమెన్స్‌కి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సిమెన్స్‌కి కేవలం 58 కోట్ల విలువైన సాప్ట్‌వేర్‌ మాత్రమే కొన్నారని తెలిపారు. ఈ అక్రమాలపై జీఎస్టీ, ఇన్‌కంట్యాక్స్,ఈడీ విచారణ చేస్తున్నాయని చెప్పారు. ఈ స్కామ్‌లో ఇప్పటికే ఈడీ నలుగురిని అరెస్టు చేసిందని మంత్రి బుగ్గన తెలిపారు. 
 

Back to Top