అమరావతి: రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం అని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సాగునీటి వనరులులేని ప్రాంతంలో రైతుల బోర్లుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని దివంగత మహానేత వైయస్‌ఆర్ ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారని,కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్టు రాలేదన్నారు.అయినప్పటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన మొదటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు.వైయస్‌ఆర్ ఉన్నంత కాలం 7 గంటలు కూడా విద్యుత్‌ను అందించారు.ఆయన బాటలో తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నడవడం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏపీలో 9 గంటలు విద్యుత్ ఇచ్చే ఆలోచనే చేయలేదన్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చిన అన్ని హామీలను సీఎ వైయస్ జగన్ అమలు పరిచే విధంగా ముందుకు నడుస్తున్నారన్నారు. ప్రమాణా స్వీకారం చేసి నెలరోజులు కాకముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేస్తున్నారని తెలిపారు.వైయస్‌ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం పట్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు.