సీఎం సార్‌..మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం

రెడ్డి అప్పలరాజు, రైతు, గంగమంబపురం అగ్రహారం, అచ్యుతాపురం మండలం, విశాఖపట్నం జిల్లా

సీఎం గారికి నమస్కారాలు, సార్‌ మీరు నాడు పాదయాత్రలో భూ సమస్యల గురించి రైతులు చెప్పగానే, అధికారంలోకి రాగానే నేనున్నాననే భరోసాతో ముందుకెళుతూ ప్రతీ ఇంటికి పెద్ద కుమారిడిలా ఆలోచించి ఈ పథకం తీసుకొచ్చారు. మా జిల్లాలో ముందుగా చేయడంతో మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ సర్వే చేయడం మాకు సంతోషంగా ఉంది. మా తాతల కాలం నుంచి భూములు ఉండడం వల్ల మాకు పక్క పొలాల రైతుల నుంచి ఎప్పుడూ సరిహద్దు సమస్యలు ఉండేవి. మాకు సరిగా హద్దులు తెలియక, సర్వే నెంబర్లు లేక ఇబ్బందులు పడేవాళ్ళం. అత్యవసర పరిస్ధితుల్లో భూములు అమ్ముకుందామన్నా కుదిరేది కాదు. మేం సాగుచేస్తున్నా కూడా వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు సరిగా ఉండేవి కాదు. మేం సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా సరిగా జరిగేది కాదు, ఏం చేయాలో తెలియని పరిస్ధితిలో ఉండేవాళ్ళం. కొద్ది రోజుల క్రితం స్ధానిక అధికారులు వచ్చి మేం సర్వే చేయించి సర్వే రాళ్ళు కూడా వేసి అన్నీ క్లియర్‌ డాక్యుమెంట్స్‌ ఇస్తామన్నారు. చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా మీరు అత్యాధునిక పరికరాలతో సర్వే చేసి నా భూమి హద్దులు, డాక్యుమెంట్‌లు ఇచ్చారు. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం ఎక్కడికెక్కడో తిరగాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏకంగా గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. మా రైతుల సమస్యలపై ఇంతలా ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. మీరే మాకు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

తంలో సర్వే చేయాలంటే ఎమ్మార్వో ఆఫీస్‌ చుట్టూ తిరగాల్సి వచ్చేది :
పరమేష్, రైతు, పందిపాడు, కర్నూలు జిల్లా

అన్నా మా పందిపాడు గ్రామంలో మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మా గ్రామం మొత్తం భూమి అంతా కూడా రీసర్వే చేశారు. గతంలో సర్వే చేయాలంటే ఎమ్మార్వో ఆఫీస్‌ చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా సచివాలయంలో ఉండే సర్వేయర్లు సర్వే చేయడమే కాకుండా నాణ్యతతో కూడిన మ్యాపులు కూడా ఇచ్చారు, అంతేకాదు భూ సరిహద్దుల్లో నాణ్యమైన రాళ్ళు కూడా పాతారు. ఎలాంటి ఖర్చు లేకుండా సర్వే చేయడం మాకు సంతోషంగా ఉంది. మా గ్రామస్తులంతా చాలా సంతోషంగా ఉన్నారు, గతంలో థామస్‌ మున్రో అనే దొర కర్నూలు జిల్లాకు మంచి పనులు చేశారని జనాలు చెప్పుకుంటే విన్నాను కానీ ఇప్పుడు మీరు మరో మున్రో దొర అని అందరూ అంటున్నారు. జిల్లా అంతా ఇదే చెప్పుకుంటున్నారు. మీరు ప్రవేశపెట్టిన చాలా పథకాలు బావున్నాయని అందరూ అంటున్నారు, వారంతా ఇంటికి పెద్ద కొడుకులా భావిస్తున్నారు. ఇంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అన్న మీ చిరునవ్వు చెరగనీయకుండా పథకాలు కొనసాగిస్తున్నారు. రైతు గెలవాలి, వ్యవసాయం గెలవాలి...ఈ రెండూ జరగాలి అంటే మీరు శాశ్వతంగా సీఎంగా ఉండాలి, ధ్యాంక్యూ అన్నా.

 ప్రతీ రైతు గుండెల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారు:
షేక్‌ సల్మా, నువ్వూరుపాడు, నెల్లూరు జిల్లా

అన్నా మీరు పాదయాత్రలో రైతుల సమస్యలు తెలుసుకుని నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు. మీరు ఈ పథకం ద్వారా రీసర్వే చేసి మా తాత గారి పేరు మీద ఉన్న పొలాన్ని మా నాన్న, చిన్నాన్న పేరు మీద మార్చినందుకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు అన్నా, మా గ్రామంలో ప్రతీ పొలాన్ని రీసర్వే చేశారు, ప్రతీ రైతు గుండెల్లో మీరు శాశ్వతంగా నిలిచిపోతారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేయడం చాలా సంతోషకరం. గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, సర్వే చేయడమే కాకుండా సర్వే రాళ్ళు కూడా ఉచితంగా అందించారు. పొలాలే కాకుండా ప్రతీ ఇంటిని, స్ధలాలను సర్వే చేసి మాకు హక్కు పత్రాలను కూడా అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. మా గ్రామ ప్రజల తరపున మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

తాజా ఫోటోలు

Back to Top