తిరుపతి: కూటమి ప్రభుత్వం పాలనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు కొనసాగుతున్నాయి. తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్‌లో ఈ నెల 14న భోగి సందర్భంగా ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలు అమలు చేయలేదని నిరసనగా మానిఫెస్టో కాపీలను దగ్ధం చేసిన ఘటనపై ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ నెంబర్ 48/2026గా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లం రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లానీ బాబు, సురేష్, అనిల్ రెడ్డి, తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, వైయస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్, మునిరెడ్డి, అమరనాథ్ రెడ్డి, అనిల్ రెడ్డి, విజయలక్ష్మి, చిరంజీవి, డీజిల్ వెంకటేష్, పద్మజ, ఆంజనేయులు మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుతున్నారనివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందని, ఆ హక్కును అణిచివేయడానికి ప్రయత్నిస్తే తగిన విధంగా పోరాటం కొనసాగిస్తామని పార్టీ స్పష్టం చేసింది.