తాడేపల్లి: వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ వేస్తే.. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా దానికి మద్దతుగా నిలిచిందని జూపూడి తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా తాము స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా ఈనాడు విషపు రాతలు మానుకోవాలని జూపూడి ప్రభాకర్ రావు హితవు పలికారు. ప్రెస్ మీట్ లో జూపూడి ప్రభాకర్ ఇంకేమన్నారంటే... మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు అద్భుత తీర్పు మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు అద్బుతమైన తీర్పు ఇచ్చింది. ఈనాడు కిరణ్ మార్గదర్శి కేసులో ఉన్న తండ్రి చనిపోయాడు కాబట్టి కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ ఆయన గుర్తుంచుకోవాల్సింది ఈ కేసులో ఉన్న వ్యక్తి చనిపోయినా వ్యవస్థ మాత్రం బతికే ఉంటుంది. బాధితులకు చెల్లించాల్సిన డబ్పులు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టం చేసింది. ఈ కేసులో పోరాటం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా అన్ని విధాలా అండదండలు అందించారు. ఆ తర్వాత బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించేస్తున్నాం కాబట్టి కేసు కొట్టాయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిల్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కు వచ్చిన సమాధానంలో మార్గదర్శి కేసు ఇక్కడి నుంచి ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు చెప్పింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఈనాడు, మార్గదర్శిని తదుపరి విచారణకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనాడు చరిత్ర అంతా విషపు రాతలే మార్గదర్శి కేసు చూస్తుంటే.. " నా దగ్గర లైసెన్స్ లేని తుపాకీ ఉంది, కానీ నేను ఎప్పుడూ ఎవరినీ కాల్చలేదు, కాబట్టి నేను ఎవర్నీ చంపలేదనేగా ? నా మీద ఎవడో కేసు పెట్టాడు, తిరిగి నేను తుపానీ ఇచ్చేశాను కాబట్టి నన్ను వదిలేయండి " అన్నట్లుగా ఉంది. తుపాకీ కలిగి ఉండటమే నేరం, లైసెన్స్ తీసుకోకపోవడం మరో తప్పు. ఈ రెండూ జరిగిన తర్వాత నేను ఎవరినీ కాల్చలేదు, తుపాకీ తిరిగి ఇచ్చేశాను అనేది రామోజీరావు వాదన. అవిభజిత హిందూ కుటుంబ చట్టం ప్రకారం గుడివాడకు చెందిన అంజిరెడ్డి ఏర్పాటు చేసిన సంస్థను లాక్కుని రామోజీరావు నిర్వహించారు. కంపెనీల చట్టం ప్రకారం కూడా నమోదు కాని ఓ కంపెనీ రూ.2600 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది. 2.75 లక్షల మంది డిపాజిటర్లను మోసం చేశారు. ఈ డబ్బులతో ఈనాడు పత్రిక, పచ్చళ్లు అని పలు వ్యాపారాలు పెట్టి సమాజానికి చేసిన మేలు కూడా ఏమీ లేదు. మార్గదర్శి నుంచి సంపాదించిన డబ్బు, దోచుకున్న డబ్బులతో పత్రిక పెట్టి స్వలాభం కోసం, మీ మనుషుల కోసం వాడారు. ఎన్టీఆర్ వంటి వారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వస్తే.. ప్రభుత్వాన్ని నేనే నడుపుతానంటూ రామోజీరావు ఒత్తిడి చేశారు. కానీ ఎన్టీఆర్ నువ్వేమీ నడపాల్సిన అవసరం లేదంటూ తిరస్కరించారు. దీంతో ఎన్టీఆర్ మీదే దుమ్మెత్తి పోసి, లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని ఆయన్ను మానసికంగా చంపేవరకూ వెళ్లారు. అంతెందుకు మద్యపాన నిషేధం నేను చెప్తేనే చేస్తున్నారని మీ పత్రికలో రాసుకున్నారు. కానీ ఇదేదో గిట్టుబాటు కావట్లేదని చంద్రబాబుతో మాట్లాడేసుకుని, మద్యపానం లేకపోతే ప్రభుత్వాలు నడవట్లేదని రాతలు రాశారు. దీన్ని వ్యతిరేకించిన రాజశేఖర్ రెడ్డి గారి మీద ఇష్టారాజ్యంగా రాతలు రాశారు. దీని మూలాలు తిరిగి మార్గదర్శి నుంచి వచ్చిన డబ్బులతో పెట్టిన ఈనాడులోనే ఉన్నాయి. మార్గదర్శిపై వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. టీడీపీకి వ్యతిరేకం అన్న కారణంతో తండ్రీ కొడుకులపై తప్పుడు రాతలు రాసి వేధించారు. వ్యక్తిత్వాల హననం, కుటుంబాలను వేధించడం, సైకో అనడం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రామోజీ రావు ఈ మధ్య చనిపోయినా, ఆయన కుమారుడు కిరణ్ తన తండ్రి సంప్రదాయాన్ని ఏమాత్రం వదలకుండా కూటమి ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారు. ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ప్రజలు మాట్లాడుతుంటే, ఈయన మాత్రం ఇలాంటి కూటమి లేదు, ముఖ్యమంత్రి లేరంటూ రోజూ బాకాలు ఊదటమే. ఈ మధ్యే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన చేస్తే.. దానికి వ్యతిరేకంగా ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఈనాడు పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకో అంటూ ఇషారాజ్యంగా రాతలు రాస్తున్నారు. ఇప్పుడు మార్గదర్శి విషయంలో సంస్థ పెట్టిన వ్యక్తి లేడు కాబట్టి కేసు కొట్టేయమని వెళ్తే సుప్రీంకోర్టు.. చాచి చెంప మీద కొట్టింది. రూ.2600 కోట్లు వసూలు చేశారని, 2 లక్షల 75 వేల మందిని మోసం చేశారని, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లారని సుప్రీంకోర్టు చెప్పింది. వ్యక్తి లేనంత మాత్రాన మార్గదర్శి ఏమీ మూతపడలేదే ? ఇప్పటికీ నడుపుతున్నారుగా. దారుణమైన రాతలు రాస్తున్న ఈనాడు గ్రూప్ సంస్థ మార్గదర్శికి చెంపపెట్టులా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతిచ్చిన కేసు సుప్రీంకోర్టులో నిలబడటానికి కారణం మార్గదర్శి డిపాజిట్లకు చేసిన మోసమే. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.