వైయ‌స్ఆర్ జగనన్న కాలనీలు దేశానికే ఆదర్శం

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

 అనంత‌పురం: చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇస్తున్నాడని ఒకే సారి 32 లక్షల ఇళ్ళని నిర్మించే యజ్ఞాన్ని చేపట్టాడని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.సోమవారం ఉరవకొండలోని రాయంపల్లి రాస్తా వద్ద నున్న 'వైస్సార్ జగనన్న కాలనీ' లో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండ త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్పంచ్ లలిత అధ్యక్షతన లబ్దిదారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారితో ముఖాముఖీ నిర్వహించారు. ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, తహశీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, హౌసింగ్ డిఈ వరప్రసాద్, విద్యుత్ ఏఈ గురుమూర్తి, ఆర్డబ్ల్యుఎస్ జెఈ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాలనీలో సమస్యలు పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం పట్ల విశ్వేశ్వరరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరు పేదలందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఒకేసారి దాదాపు లక్ష కోట్ల రూపాయలతో ఇన్ని లక్షల ఇళ్ళు నిర్మిస్తుంటే చంద్రబాబు ఆయన పార్టీ నేతలు ఓర్వలేక ఇళ్ల నిర్మాణాలు ఆపమని హై కోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. అందుకే ఇళ్ల నిర్మాణాలు ఆలస్యమైయ్యాయని తెలిపారు. వైయ‌స్ జగన్ తలపెట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతం కావాలంటే అధికారులు, వైయ‌స్సార్సీపీ నేతలు లబ్ధిదారులతో సమన్వయం తో పని చేసి పూర్తి చేయాలన్నారు.ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఈ కాలనీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రజలు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టాలని కోరారు. అందుకు కావాల్సిన సిమెంట్, ఇసుక తదితర వన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బిల్లులు కూడా ఆలస్యం కాకుండా వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వన్నప్ప, పెన్నహోబిలం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్, వైయ‌స్సార్సీపీ నాయకులు బ్యాంక్ ఓబులేసు, ఈడీగ ప్రసాద్, బసవరాజు, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఓబన్న, జోగి భీమా, అంగదాల అంజి, అయ్యర్ దాదు,ఎంపిటిసిలు జోగి మంజుల, పెద్దక్క,వార్డు సభ్యులు రత్న, చేజాల ప్రభాకర్ తదితరులతో పాటు వివిధ శాఖ అధికారులు,సచివాలయ సిబ్బంది,వైకెపి యనిమేటర్లు, వలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top