ఉరవకొండ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదవాడికి అందుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు,ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని దీన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తిప్పి కొట్టాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో రెండవరోజు ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు.ముందుగా సర్పంచ్ బ్యూల రాణి రాజశేఖర్,ఎంపిటిసిలు లక్ష్మీ,నాయకులు డిష్ వెంకటేష్,శన్ముఖ్ గౌడ్, వెంకటేష్,నల్ల సుంకన్న తదితరులు మాజీ ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తూన్నామని వివరించారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ నాయకులు శివానంద గౌడ్, ఎంపీపీ కరణం పుష్పావతి, జెడ్పిటిసి హనుమంతు, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, జేసిఎస్ మండల కన్వీనర్ భరత్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బసన్న, ఎస్సి విభాగం నాయకులు విడపనకల్లు సుంకన్న తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాము ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గడప గడప కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎక్కడ పత్తా లేకుండా పోతుతుందోనని ఈనాడు, ఏబీఎన్, టివి5 లు వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్దాలతో తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు.ఈ పచ్చ మీడియాకు ధైర్యం,చిత్తశుద్ధి ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప కార్యక్రమంలో తమతో పాటు పాల్గొనాలన్నారు. ప్రజల్లో తమపై ఎంత అభిమానం అప్పుడు తెలుస్తుందన్నారు.ఊరికే రావడం ఎదో ఫొటో, వీడియో తీయడం ప్రజల్లో ఎదురుగాలి అంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఇప్పటి వరకు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేని పయ్యావుల కేశవ్ ను ఏనాడు ఎల్లోమిడియా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు.అమరావతికే పరిమితం అయి కేవలం చుట్టప చూపుగా వస్తున్న కేశవ్ గురించి రాసే దమ్ము, ధైర్యం ఎల్లోమిడియాకి ఉందా అని ప్రశ్నించారు.తాము ఏమీ అనమనే ధైర్యంతోనే ఎల్లో మీడియా ఇలా బరితెగించి తమపై తప్పుడు వార్తలు రాస్తూ..చూపుతున్నాయని ఆయన విమర్శించారు.నిన్నటి రోజు త్రాగునీటి విషయంలో మహిళలు అడుగుతున్నారని దానిపై మా నాయకులు మహిళలకు సర్ది చెబుతుంటే దాన్ని పట్టుకుని అడ్డుకున్నారు.. నన్ను నిలదీసారు అంటూ తప్పుడు రాతలు రాయడం సరికాదన్నారు.మీకు చేతనైతే అభివృద్ధికి సహకరించాలని లేకపోతే మౌనంగా ఉండాలని అంతేగాని ఎదో జరుగుతోందంటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చెయ్యొద్దని హితవు ఆయన పలికారు. ఈ ఎల్లోమిడియా తీరు ఇలాగే కొనసాగితే ప్రజల్లో అవి పూర్తిగా విశ్వసనీయత కోల్పోతాయని చెప్పారు.ఈ దుష్ట చతుష్టయం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నమ్మకంతో ఉన్నారన్నారు.సీఎం జగన్ చెప్పినట్లుగా 175 కి 175 గెలుస్తామనే ధీమాను విశ్వేశ్వరరెడ్డి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాసులు, తహసీల్దార్ ఈరమ్మ, ఇతర అధికారులు,సచివాలయ సిబ్బంది, పాల్తూరు వైస్సార్సీపీ నాయకులు రహమత్ హుస్సేన్,రాముడు, సుంకిరెడ్డి,వన్నప్ప,పొట్టి సుంకన్న,నల్ల సుంకన్న, శర్మస్,రోగప్ప, నాగరాజు,వన్నూరు, కరకముక్కల సర్పంచ్ రామంజిరెడ్డి, హవలిగి రాజశేఖర్, రఘురామ్, పెంచలపాడు కేశన్న, గాజుల మల్లాపురం శంకర్ గౌడ్, వన్నారెడ్డి, వెంకటేష్, ఎర్రిస్వామి సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.