పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్ల తొలగింపునకు కుట్ర

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 3 లక్షల పెన్షన్ల కోత

మానవత్వం లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం

వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయో నాటికి మొత్తం పెన్షన్లు : 66,34,742

పెన్షన్ ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం : రూ.92,547.66 కోట్లు

పెన్షనర్ల చేతికి వారి ఇంటివద్దే ఒకటో తేదీన పెన్షన్ అందించడం దేశ చరిత్రలోనే తొలిసారి

పెన్షన్‌కు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడి

ఎన్నికలకు ముందు నుంచి పెన్షన్లర్లపై తెలుగుదేశం కక్షసాధింపు

ఇంటివద్దే పెన్షన్ అందకుండా ఎన్నికల కమిషన్ తో కుతంత్రం

ఏప్రిల్‌ మొదటి వారంలో పెన్షన్ కోసం ఎండల్లో సచివాలయాలకు వెళ్ళి 46 మంది వృద్ధులు మృతి 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన జూన్‌ నుంచి ప్రతి నెలా పెన్షన్లు తగ్గింపు 

ఈ  6 నెలల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారు

ఈ ఆరునెలల్లో కొత్తగా పెన్షన్ కోరుతూ 2 లక్షల దరఖాస్తులు

కొత్తవి మంజూరు చేయకపోగా, ఉన్న పెన్షన్లకే కోత

రాష్ట్రంలో భారీగా పెన్షన్ల తొలగింపుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు

లబ్ధిదారుల వెరిఫికేషన్ ముసుగులో పెన్షన్ల తొలగింపు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు లక్షల పెన్షన్ లను తొలగించారని, భవిష్యత్తులో భారీగా పెన్షన్ల కోతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.  

సామాజిక పెన్షన్ల పంపిణీలో దేశానికే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆదర్శప్రాయం

అత్యంత పారదర్శకంగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సామాజిక పెన్షన్ల పంపిణీ దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆదివారం అయినా, సెలవు రోజైనా, ఇతర పండగ రోజు అయినా సరే, తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టిన వాలంటీర్లు.. స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక మంచి సంప్రదాయాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. అందుకోసం  ప్రభుత్వం ఏకంగా రూ.92,547.66 కోట్లు  

పెన్షనర్ల పట్ల టిడిపివి మొదటి నుంచి కక్షసాధింపు చర్యలే

ఎన్నికల సమయంలో వైయస్ఆర్ సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అడ్డుకుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా నెల ఒకటోతేదీన తెల్లవారుజామునే పెన్షన్ సొమ్మును ఇంటి వద్దే వృద్దులు అందుకునే ప్రక్రియకు ఆటంకం కల్పించింది. వాలంటీర్లను తప్పించి, పెన్షనర్లు సచివాలయంకు వచ్చి పెన్షన్ సొమ్ము తీసుకోవాలనే ఆదేశాలు వచ్చేందుకు కారణమయ్యంది. తెలుగుదేశం పార్టీ కుట్ర కారణంగా సచివాలయాల ముందు పెన్షన్ సొమ్ము కోసం వెళ్లి మండే ఎండలకు తాళలేక 46 మంది వృద్దులు మృత్యువాత పడ్డారు. దీనికి తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాలి. అనేక మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా ఆధార్ లింక్ లేకపోవడం, ఇతరత్రా సమస్యల వల్ల చాల మందికి పెన్షన్లు అందని పరిస్థితి ఏర్పడింది. పెన్షన్లు సకాలంలో అందక అనేక మంది ఇబ్బందులు పడ్డారు. 

ఒకచేత్తో పెన్షన్లు ఇస్తున్నట్లు నటన... మరో చేత్తో పెన్షన్ల తొలగిస్తూ..  

ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే, పెన్షన్‌ రూ.1000 పెంచి, రూ.4 వేలు ఇస్తామని, అది కూడా ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని ఆర్భాటంగా చంద్రబాబు హామీలు గుప్పించాడు. అధికారం చేపట్టాక, అట్టహాసంగా, నానా హంగామా చేస్తూ, ఆ పెన్షన్లు పంచారు. ఆ తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. కూటమి ప్రభుత్వ కుట్ర, కుతంత్రాలు మొదలయ్యాయి. ఒక చేత్తో ఇస్తున్నట్లు నటిస్తూ.. మరో చేత్తో కోత పెట్టే ప్రయత్నాలు ప్రారంభించాడు. జూన్‌ నుంచి ప్రతి నెలా పెన్షన్లు తగ్గిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు కట్‌ చేశారు. ఎన్నికలు జరిగిన నాటికి వైయస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిసెంబరు నాటికి వాటి సంఖ్య 63,20,282 పెన్షన్లకు తగ్గించారు. అంటే ఆరు నెలల్లో ఏకంగా 3 లక్షలకు పైగా పెన్షన్లు తగ్గించారు.

కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం

చంద్రబాబు హామీలు నిజం అని నమ్మి కొత్తగా పెన్షన్‌ల కోసం దాదాపు 2 లక్షల దరఖాస్తు చేశారు. వాటిని మంజూరు చేయకుండా ఉన్న పెన్షన్లకే కోత పెట్టారు. ఆ కోత సరిపోదంటూ, కొత్తగా వెరిఫికేషన్‌ మొదలుపెట్టారు. పెన్షనర్ల వెరిఫికేషన్‌లో స్థానిక సచివాలయలకు కానీ, మండలానికి కానీ సంబంధం లేదు. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేయాలని నిర్దేశించారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన, ఒక్కో బృందం 40 మంది లబ్ధిదార్లను వెరిఫికేషన్‌ చేస్తారు. గ్రామ జనాభా, పెన్షనర్ల సంఖ్యను బట్టి, ఆ బృందాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఎనిమిది పారామీటర్స్‌ నిర్దేశించారు. చివర్లో వారు పెన్షన్‌కు అర్హులా? కాదా? అన్న ఒక ఆప్షన్‌ పెట్టారు. అధికారి ఒక టిక్‌తో ఆ పెన్షనర్‌ భవిష్యత్‌ను మార్చేసే ప్రక్రియ మొదలైంది.

వైయస్ఆర్‌సీపీ హయాంలో అత్యంత పారదర్శకంగా పెన్షన్ల మంజూరు

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేస్తే, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేవారు. జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించే వారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి, తుది జాబితా సిద్ధం చేసేవారు. ఆ విధంగా ఏ ఒక్క అర్హుడూ, ఏ పథకానికి దూరం కాకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా, ఎక్కడా వివక్ష, రాజకీయాలకు తావు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, శాచురేషన్‌ పద్ధతిలో పథకాలు, కార్యక్రమాల అమలు జరిగింది. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంతా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక్కడ దరఖాస్తుదారుడు లేదా ఇప్పటికే పెన్షన్‌ పొందుతున్న వారు అర్హులా? కాదా? అన్న విషయాన్ని వెరిఫికేషన్‌ చేసే ఉద్యోగి నిర్ణయిస్తాడు. ఇది అత్యంత దారుణం. పెన్షన్ తీసుకోవాలంటే టిడిపిలో చేరాలి. పార్టీలు మారి, కండువా కప్పుకుంటే తప్ప పెన్షన్ రాదు అనే పరిస్థితి కల్పించారు.

వైయస్ఆర్ సీపీకి మద్దతు పలికారంటూ పెన్షన్ల తొలగింపు

వైయస్ఆర్‌సీపీకి మద్దతు పలికారని.. వృద్దులని కూడా చూడకుండా పెన్షన్లు తొలగించారు. కొందరి పేర్లు­న్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌ నుంచి బదిలీచేశారు. పెన్షనర్లను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాల­య పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్‌ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలా­మంది సతమతమవుతున్నారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలోనే అరాచకం

పెన్షన్లు ఆపడం, ఇతర జిల్లాలకు బదిలీ చేయడం, పార్టీలు మారితే కానీ పెన్షన్ ఇవ్వము అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకర్గంలో జరుగుతోంది. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. 

ఎన్నికల హామీలను నెరవేర్చకుండా... అమలు చేస్తున్న వాటిని కూడా ఆపేస్తారా?

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, గతం నుంచి అమలు జరుగుతున్న పథకాలను కూడా ఆపేస్తామంటున్న కూటమి ప్రభుత్వ విధానాలను ఎలా అర్థం చేసుకోవాలి. ఆరు నెలలు తిరక్కుండానే కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు పెన్షనర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకపోగా, అమలు చేస్తున్న వాటిలో కూడా కోత పెడుతున్నారు. ప్రతి వైఫల్యానికి గత ప్రభుత్వాన్ని నిందించడం, ఏ పని చేయకున్నా, అన్నీ చేస్తున్నట్లు తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం.. చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.

Back to Top