అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన కొడుకు లోకేష్‌

మాజీ మంత్రి పేర్ని నాని 

కుప్పం సభలో లోకేష్‌ బరితెగించి అసత్యాలు మాట్లాడారు

లోకేష్‌ యాత్ర ప్రాయోజిత కార్యక్రమం

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారు?

చంద్రబాబు చెత్త నాయకుడని అచ్చెన్నాయుడే అంటున్నారు

జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ముందా?

మీరు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం వైయస్‌ జగన్‌ను మిల్లీ మీటరు కూడా కదపలేరు

లోకేష్‌కు, పిట్టల దొరకు తేడా ఏముంది?

తాడేపల్లి: అబద్ధాలు చెప్పడం, అసత్యాలు వల్లించడంలో చంద్రబాబు ఒక ఆకు చదివితే..ఆయన కుమారుడు నారా లోకేష్‌ పది ఆకులు చదివారని, ఈ విషయంలో తండ్రిని మించిని కొడుకు లోకేష్‌ అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్‌ ఎందుకు రోడ్డున పడుతారని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు, లోకేష్‌ మాటలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.  పెన్షన్‌ తీసేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ వల్ల చంద్రబాబు, లోకేష్‌ ఉద్యోగాలే పోయాయని చెప్పారు. నంద‌మూరి వార‌సుల‌ను చూసి చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబుకు దమ్ముంటే వైయ‌స్ జ‌గ‌న్‌పై ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా వైయస్‌ జగన్‌ను మిల్లీమీటరు కూడా కదపలేరని పేర్ని నాని హెచ్చరించారు. నారా లోకేష్‌ ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి తిప్పికొట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 • ఇవాళ కుప్పం సభలో నారా లోకేష్‌ భరితెగించి అబద్ధాలు మాట్లాడారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న ధ్యాస లేకుండా..మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు. అప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు.  ప్రజలు ఏమనుకుంటారో? నాకు ఒక్కడికే కదా ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిందన్న బెరుకు, భయం లేకుండా నారా లోకేష్‌ ఇవాళ పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడారు. 
 • నాకు భయం లేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. భరితెగించి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ఒక్క మాటలో కూడా నిజం లేదు.
 • ఇసుక వేస్తే భూమి మీద పడే పరిస్థితి లేదట. అక్కడ కూర్చున్నవాళ్లు కుర్చీల్లో కూర్చున్నారు. ఒకసారి ఇసుక వేసి ఉంటే పరిస్థితి ఏంటో తెలిసేది.
 • మీ నాన్నగారి హాయంలో వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే..ఇవాళ రోడ్ల వెంట తిరిగే గతి ఎందుకు పట్టింది? ప్రజలు ఎందుకు మిమ్మల్ని చెత్త చెత్తగా ఓడించారు?. ఏమీ చేయలేదు. అంతా మాయాజాలం, అసత్యాలు అని ప్రజలు గమనించి మీకు బుద్ధి చెప్పారు. మళ్లీ అదే అసత్యాలు చెబుతున్నారు.
 • ఇవాళ టీడీపీ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే..ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతారు. నారా చంద్రబాబు అధికారం లేకపోతే కార్యకర్తలకు సబ్బు రాస్తారు. దువ్వుతారు, నెత్తిమీద పెట్టుకుంటారు. అధికారం వస్తే అధికారులతో కలిసి వెళ్తారు. కార్యకర్తలను గాలికివదిలేస్తాడని అచ్చెన్నాయుడు మాట్లాడారు.  లోకేష్‌ అలాంటి వ్యక్తి కాదు..కార్యకర్తలకు మొత్తం దోచి పెడతారని మాట్లాడారు. చంద్రబాబు ఎందుకు పనికిరాని నాయకుడు, చెత్త నాయకుడని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతారు. కొడుకేమో మా నాన్న వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అని లోకేష్‌ చెబుతాడు. ఎవరిది నిజం? 
 • మీ సంస్కారాన్ని, సాంప్రదాయాన్ని అద్దం పట్టే మంచి సైజ్‌ ఉన్న మనిషిని పార్టీ అధ్యక్షుడిగా నియమించుకున్నారే..అతని మాటలు కరెక్టా? లేకపోతే మా నాన్నే నాయకుడు అన్న లోకేష్‌ కరెక్టా?
 • పోలీసులు లేనిదే బతకలేరు. ఏటేటా అమీత్‌ షా వద్దకు వెళ్లి, కోర్టులకు వెళ్లి గన్‌మేన్లను పెంచుకుంటారు. పోలీసులు కావాలంటారు. పోలీసు భద్రతను తగ్గించారని లబోదిబోమంటారు. లోకేష్‌ మాట్లాడుతారు..మా అబ్బాయికి గన్‌మెన్లు తీసేశారని అంటారు. పోలీస్‌ గన్‌మెన్ల భద్రతతో బతికే వీరు పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. పోలీసులను కించపరుస్తూ, నిర్లజ్జగా పోలీసుల గురించి మాట్లాడే వారిని ఏమనాలి? ఇటువంటి వారు ఆ పార్టీ అధ్యక్షులు అయితే..ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారు. 
 • లోకేష్‌ తొక్కుకుంటూ వెళ్తారట. ఏనుగులు ఏం చేస్తాయి..ఇవాళ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత లక్ష 40 వేల మందిని సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించారు. 40 వేల మందిని ఆసుపత్రుల్లో ప్రభుత్వ నియామకాలు చేపట్టారు. రాష్ట్ర యువతను ఉద్యోగులుగా మార్చారు.
 • ఆర్టీసీ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న వారిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌. 
 • పెన్షన్లు కోసేశామని మాట్లాడుతున్నారు. పచ్చి అసత్యాలు ఇవి. మీ పాలనలో 40 లక్షలు ఉంటే ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం  ఇది. అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించాలనే కుతంత్రాలు వారివి.
 • దిశ చట్టం ఏమైంది అంటున్నారు. మీరు మోదీని అడగాల్సింది? మోదీ చెవిలో చెప్పాల్సింది. వైయస్‌ జగన్‌ పంపించిన దిశ చట్టం ఆమోదించి పంపించాలని మోదీకి చెప్పండి?. ఎవడైతే పాపాలు చేశారో వారందరికి 21 రోజుల్లో శిక్షలు విధిస్తారు.
 • 40ఏళ్ల వయసులోనే లోకేష్‌ భరితెగించి మాట్లాడుతున్నాడు. భూమ్‌ భూమ్, ప్రెసిడెంట్‌ మెడల్, ఆంధ్రగోల్డు బ్రాందీ అమ్ముతున్నారని లోకేష్‌ అంటున్నాడు. వీటి సృష్టికర్త మీ నాన్నారే అని తెలుసుకుంటే మంచిది.
 • ఇంత నిర్లజ్జగా అసత్యాలు మాట్లాడటం దుర్మార్గం. టీడీపీ పాలనలో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి బకాయి పెడితే వైయస్‌ జగన్‌ రూ.1100 కోట్లు చెల్లించింది సత్యమని తెలుసుకుంటే మంచిది.
 • ఈ ఏడాది జనవరి 9వ తేదీ వరకు ప్రతి గింజకు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. 21 రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. 
 • వాతావరణం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం.
 • కరెంటు బిల్లుల పాపం ఎవరిది? టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.25 వేల కోట్ల అప్పుల పాపాలు మీవే కదా? మీరు అప్పులు చేసి, మీరు పాపాలు చేసి వైయస్‌ జగన్‌పై నిందలు వేయడం మీకు సిగ్గు అనిపించడం లేదా? 
 • యువతకు మేం దిక్కు అంటారు. 2014 నుంచి 2019 వరకు యువతకు ఏం చేశారు. పరిశ్రమలు ఏమయ్యాయి. కియా తప్పితే ఈ రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంటీ? చంద్రబాబు కొడుకుకు తప్ప వేరే ఎవరికి ఉద్యోగం రాలేదు.
 • పది మంది మంత్రులు ఏ హోదాతో పాదయాత్ర చేస్తున్నారని అడుగుతున్నారని అంటున్నారు. మంత్రులకు నీతో ఏం అవసరం? నీవు ఏ అర్హతతో మంత్రివి అయ్యావు. ప్రజలు ఓట్లు వేస్తే మంత్రివి అయ్యావా? ఎమ్మెల్సీ అవ్వడానికి నీకు ఉన్న అర్హత ఏంటి? ఒక్క చంద్రబాబు కడుపున పుట్టడమే నీ అర్హత. దొడ్డిదారిన మంత్రి అయి నీవు చేసింది ఏంటంటే..అబద్ధాల్లో చంద్రబాబు కంటే నీవు నయం అంటున్నారు. అసత్యాలు  చెప్పే విషయంలో నీ కన్నా నీ నాన్న నయం అంటున్నారు.
 • రాష్ట్రంలోని పోలీసు అధికారుల తోలు ఒలిచి ప్రజలకు ఇస్తారట? మీ తోలు మందంగా ఉంటుంది. కాబట్టి అచ్చెన్నాయుడి తోలు ఒలిపించి పోలీసులకు బూట్లు కుట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
 • జీవో1 ఎక్కడ మడత పెట్టి పెట్టుకుంటారో పెట్టుకోండి. స్టాన్‌ఫోర్డులో చదివాడట? ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశారట. ఆయన చదువు, సంస్కారం ఏంటంటే..మీరు ఏం పీకావు అంటున్నారు. 
 • అబద్దాలు చెప్పి, మోసపూరిత మాయమాటలు మానుకోండి. 2014–2019 దాకా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు మళ్లీ ఏర్పాటు చేస్తాం..మాకు అవకాశం ఇవ్వండి అని అడిగే దమ్ముందా లోకేష్‌?.
 • తెలుగు గంగ గురించి మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ను కుట్రలు, కుతంత్రాలతో వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. సిగ్గుండాలి? 
 • మనుషులను ఏమార్చి, అసత్యాలతో ఎన్ని మాయ మాటలు చెప్పినా..ఈ అబద్ధాల లోకేష్‌ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా పేదల హృదయాల్లో వైయస్‌ జగన్‌ సంపాదించుకున్న సుస్థీర స్థానాన్ని మిల్లీమీటరు కూడా కదల్చలేరని హెచ్చరిస్తూ ..ఇవాళ ఒక లారీ వేసుకొని బయలుదేరినా, లేదా ఆరుమాసాలు కసరత్తు చేసి లోకేష్‌ రోడ్డు మీద నడిచినా, ఎన్నికుయుక్తులు పన్నినా, మీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల సంపదను మీ కార్యకర్తలకు దోచిపెట్టుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనలను ప్రజలు పటాపంచలు చేస్తారు.  
 • మీరు పాతికవేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారు కదా? ఇవాళ ఆ రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఇవే కదా మీ పాపాలు. అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు వల్ల వేయడంలో తండ్రి ఒక ఆకు చదివితే లోకేష్‌ పది ఆకులు చదివారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అసభ్య పదజాలం వాడినా కూడా..మిమ్మల్ని ప్రేమించేవారు రాష్ట్రంలో లేరని పేర్ని నాని హెచ్చరించారు.
 • లోకేష్‌..ఆయన కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ పాలనలో తండ్రి కొడుకులే కదా అరాచకాలు చేసింది. ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎన్ని గుడులు నేలమట్టం చేశారో అందరికీ తెలుసు. ఇవన్నీ ఎవరికి ఆపాధిస్తారని పేర్ని నాని ప్రశ్నించారు.
 • లోకేష్‌కు, పిట్టల దొరకు తేడా ఏముంది? ఆయనవన్నీ కూడా పిట్టల దొర మాటలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పిట్టల దొరను కన్నాడు. సంక్రాంతి వెళ్లిన తరువాత లోకేష్‌ వస్తున్నాడు. వాళ్లేమో సంక్రాంతి ముందు వస్తారు.
 • వైయస్‌ జగన్‌ భయస్తుడతై..వీళ్లేందుకు అమిత్‌షా, మోదీ కాళ్లు పట్టుకుని ఎందుకు వదలడం లేదు? ఎందుకు ఈ ప్రేమ బాణాలు. తండ్రి కొడుకు పోటుగాళ్లు అయితే వాళ్లు..వీళ్లు ఎందుకు వైయస్‌ జగన్‌పై ఒంటరిగా పోటీ చేయండి?.మీకు పొత్తులు ఎందుకు, పోరాటాలు ఎందుకు? ఇంట్లో పడుకొని నామినేషన్లు వేస్తే సరిపోతుంది కదా?. రోడ్డు మీద నడవడానికి కూడా కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవడం ఎందుకు?. రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధి ఏంటో మాతో పాటు వస్తే చూపిస్తామని పేర్ని నాని అన్నారు.
 •  
Back to Top