అమరావతి: ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సిద్ధహస్తుడని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో కురసాల కన్నబాబు మాట్లాడారు. ఇది మా ఓటమి గానీ , టీడీపీ గెలుపుగానీ కాదు... ఎన్నిక జరిగిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ 6 స్థానాల్లో గెలిచిందన్నారు. మాకున్న సంఖ్య ప్రకారం మేము ఆరూ గెలిచాం... వాళ్లకి 23 స్థానాలు ఉన్నాయి... కొంత మంది మాతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మేం పోటీ పెట్టామన్నారు. ఇవన్నీ చంద్రబాబునాయుడు టక్కు టమారా విద్యలని ధ్వజమెత్తారు. ఏం జరిగింది...ఎలా జరిగింది అనేది మేం విశ్లేషించుకుంటాం . మేం ప్రాక్టీస్ చేశాం తప్ప ఎమ్మెల్యేలను పోచింగ్ చేయలేదు.. అలాంటివి చంద్రబాబే చేశాడన్నారు. చంద్రబాబుకు ఓట్లు కొనడం ఇవాళేమీ కొత్త కాదన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చాడు...?
మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. అంటూ చంద్రబాబు అక్కడ ఓటుకు రూ.5 కోట్లు ఇవ్వాలని చూసి పట్టుబడి పారిపోయి వచ్చాడని గుర్తు చేశారు. మా పార్టీ నుంచి ఎవరు ఓట్లు వేశారో విశ్లేషించుకుంటామని, పలానా వాళ్లు అని తేలితే చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామన్నారు. పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేస్తే.. అది తెలిస్తే ఊరుకుంటారా.. ? . విశ్లేషించుకుంటాం .. మా నాయకుడు ఆలోచిస్తారు...ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని కన్నబాబు పేర్కొన్నారు.