పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్ష ఆరోపణలు

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
 

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేయని పనిని సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తున్నారన్నారు. ఆశావర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదని, ప్రతి ఆశావర్కర్‌కి పెంచిన జీతం రూ. 10 వేలు సెప్టెంబర్‌ నుంచి చెల్లిస్తామన్నారు. ఆశావర్కర్ల పాతబకాయిలను చెల్లించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు చూసి ఓర్వలేక ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.

Back to Top