అన్ని శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర‌
 

విశాఖ‌: అల్పపీడనం బలపడటం వలన రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు  గ్రామ స‌చివాల‌య‌, జిల్లాల్లోని అన్ని శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర సూచించారు. రెండు రోజులుగా రాజ‌న్న‌దొర‌ ఎప్పటికప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో  ఫోన్ లో మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆరా తీస్తున్నారు.  వర్షం ప్రభావితం ఉన్నన్ని రోజులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు  ఏ ఒక్కరూ సెలవు పెట్టకుండా వారి హెడ్ క్వార్టర్స్ లో ఉండి  విధులు నిర్వర్తించి ప్రజలకు అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ఏమి జరుగుతోంది అనే విషయాన్ని వెనువెంటనే స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు.  పార్వతీపురం మన్యం జిల్లా లో అన్ని చోట్లా కూడా  గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ వాలంటీర్లు ,  సచివాలయ ఉద్యోగులు ప్రజలను అప్రమత్తం చేస్తూ గ్రామంలో వరదలు ముప్పు వచ్చినా,  ఏ విపత్తు సంభవించిన జిల్లా కలెక్టర్‌కు సంబంధిత అధికారుల ద్వారా సమాచారం అందజేయాలని తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగిన, ఎక్కడైనా నష్టం వాటిల్లినా వెంటనే వారిని ఆదుకోడానికి సిద్ధంగా ఉండి యుద్ద ప్రాతిపదికన  చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Back to Top