గిరిజనుల కోసం వైయస్ జగన్‌ వంద అడుగులు

గిరిజన ప్రాంతాల్లో వైయస్‌ఆర్‌ను ఆరాధించని గుండె ఉండదు

గిరిజనుల గుండెల్లో మరో అల్లూరి సీతారామరాజు.. వైయస్‌ జగన్‌

గిరిజనులకు ఎస్టీ కమిషన్‌ శాశ్వత రక్షణ కవచం

 డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి

అసెంబ్లీ: గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వంద అడుగులు వేశారని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్‌ బిల్లును ఆమె సభలో ప్రవేశపెట్టారు. ఈ సంరద్భంగా పుష్పాశ్రీవాణి మాట్లాడుతూ..గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఈ రోజు ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. అన్ని రకాలుగా వెనుకబడిన, నిరాధరణకు గురవుతున్న గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఏ సీఎం చేయని ఆలోచన వైయస్‌ జగన్‌ చేయడం..నిజంగా గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. హక్కుల పరిరక్షణ లోటు గిరిజన ప్రాంత ప్రజల్లో ఉండేది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ లోటు తీరింది. ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ తీసుకురావడంతో గిరిజనుల హక్కుల ఢోకా లేదన్న భావన కల్పించారు. గిరిజనుల హక్కుల కోసం తెల్లదొరలతో పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు అయితే.. ఈ రోజు గిరిజనుల హక్కుల కోసం ఎస్టీ కమిషన్‌ తీసుకువచ్చి మరో అల్లూరి సీతారామరాజులా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా వైయస్‌ జగన్‌ నిలిచిపోయారు. గిరిజనుల హక్కుల హక్కులకు భంగం కలిగినా, సామాజిక వివక్ష చూపించినా, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగినా, గిరిజనుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినా ఈ ఎస్టీ కమిషన్‌ ప్రశ్నిస్తుంది. గిరిజనుల పక్షాన నిలుస్తుంది.  గిరిజనుల సబ్‌ ప్లాన్‌ నిధుల వినియోగాన్ని పరిశీలించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక  అభివృద్ధికి అవసరమైన సలహాలను ప్రభుత్వానికి ఈ కమిషన్‌ ఇస్తుంది.  గిరిజనుల హక్కులను కాపాడే ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.  ఈ కమిషన్‌ రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం ఇస్తున్న శాశ్వత రక్షణ కవచం. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గిరిజనులు దేవుడిలా పూజిస్తారు.  మా గిరిజనుల ప్రాంతంలో దీపం లేని గూడెం ఉంటుందేమో కానీ..వైయస్‌ఆర్‌ను ఆరాధించని  గుండెమాత్రం ఉండదు. మా గిరిజనులకు అభివృద్ధి అనే అమృతాన్ని తొలిసారి రుచి చూపించింది వైయస్‌ఆరే. పసురు మందే  గతి అనుకునే  గిరిజనులకు ఆరోగ్యశ్రీని ఇచ్చారు. ఏ ఊరికి  తెలియని ఉన్నత విద్యను తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా మేలు చేశారు. పట్టె మంచంలో మృత్యు పోరాటం చేసే మాకు 108 అంబులెన్స్‌ను వైయస్‌ఆర్‌ ఇచ్చారు.  అంబలితో  ఆకలి తీర్చుకునే మాకు రూ.2లకే కిలోబియ్యం ఇచ్చారు. గూడు లేని గిరిజన గూడెలకు సొంత  ఇళ్లను ఇచ్చారు.  తరతరాలుగా గిరిజనుడు సాగు చేసే నేల మీది కాదని వెక్కిరిస్తే తొలి సారి గిరిజనులకు భూమి హక్కులను కల్పించిన ఏకైక నాయకుడు వైయస్‌ఆర్‌. అంత గొప్ప మహారాజు కాబట్టే..కల్మషం లేని గిరిజనులు సాయం చేసిన చేతులను, ప్రాణం పోసిన దేవుడిని ఎప్పటికీ మరిచిపోరు.  ఆ దేవుడు మళ్లీ సూర్యుడు ఉదయించినట్లు ఉదయించాడని, వైయస్‌ఆర్‌ నిలువెత్తు రూపం జగన్‌ రూపంలో వచ్చిందని ఈ రోజు నమ్ముతున్నారు.  రాష్ట్రమంతా ఎలా ఉన్నా 2014, 2019 ఎన్నికల్లో గిరిజనులు వైయస్‌ జగన్‌కు అండగా నిలిచారని ఘంటాపథంగా తెలియజేస్తున్నా. ప్రతిపక్షాలకు అడ్రస్‌కూడా లేకుండా చేసి మరి వైయస్‌ జగన్‌ను నమ్మారు. వైయస్‌ జగన్‌ ఆరు నెలల పాలనతో మా గిరిజనుల నమ్మకం నిజమైంది. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ..నాన్న ఒక్కడు వేస్తే..నేను రెండడుగులు వేస్తానని చెప్పారు. ఈ రోజు గిరిజనుల కోసం వైయస్‌ జగన్‌ రెండు కాదు..వందడుగులు వేస్తున్నారని సగర్వంగా ఒక గిరిజన శాఖ మంత్రిగా చెబుతున్నాను.  గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి దాదాపు మూడున్నర ఏళ్ల పాటు ఏర్పాటు చేయలేదు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏర్పాటు చేశారు. గిరిజనులకు ఆరోగ్యశ్రీ, మండలానికో 108, గిరిజన రైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.13,500, అమ్మ ఒడి పథకం, 77 మండలాల్లో రెట్టింపు పోషకాహారం, ఇళ్ల పట్టాలు, సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న వసతి దీవెన పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం, గిరిజనుల పంటలకు ఉచితంగా బోర్లు, గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని రీతిలో ఏకైక గిరిజన పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.  గిరిజనుల కోసం పాడేరులో మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ఇంజినీరింగ్‌ కాలేజీ, సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. వందేళ్లలో ఎవరూ కూడా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయలేదు. మరో వందేళ్లు అయినా చూస్తామో లేదో అన్న వాటిని వైయస్‌ జగన్‌ వంద రోజుల్లోనే ప్రకటించారు. వైయస్‌ జగన్‌ వంద అడుగులు వేస్తున్నారు. గిరిజనులకు సాధికారిక సాధనలో ఒక్కటైన ఎస్టీ కమిషన్‌ తీసుకువస్తున్నారు. ఈ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్న వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. 

తాజా వీడియోలు

Back to Top