చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్మాదిలా మారాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నారాయణస్వామి దుయ్యబట్టారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఎన్నికల నిబంధనలు తెలియవా: ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి ఎన్నికల నిబంధనలు తెలియవా అని నిలదీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కుప్పలం ఫలితాలు చూసి చంద్రబాబు కుప్పకూలిపోయారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.