చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలి

ప్రతిపక్ష నేతకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్‌ 

చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాలు విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని చాలెంజ్‌ చేశారు.అలా చేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. గతంలో ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానన్న చంద్రబాబు..ఈ రోజు ఆయన ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఈ రోజు ఎన్టీఆర్‌ వారసుడు ఎవరో చెప్పాలని డిమాండు చేశారు. ఎన్టీఆర్‌ మరణానికి కారకుడు ఎవరో అందరికీ తెలుసు అన్నారు. వేశాలు వేసేవారు రాజకీయాలకు పనికిరారని గతంలో ఎన్టీ రామారావు చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పదవి ఇచ్చే నాడు రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి మాత్రమే ఉంటుందని సీఎం వైయ‌స్‌ జగన్ చెప్పారని తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామని స్పష్టం చేశారు. అన్ని శక్తులు ఏకమైనా... వైయ‌స్ జగన్‌ను ఏమి చెయ్యలేరన్నారు.  

తాజా వీడియోలు

Back to Top