తాడేపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంట్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వారి తరఫున సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వరుసగా 8 వ విడత...జగనన్న తోడు కార్యక్రమం సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, లబ్ధిదారులు మాట్లాడారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, చిరువ్యాపారస్తులు, కులవృత్తుల మీద ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని, రూ. 6 నుంచి రూ. 10 వడ్డీ వసూలు చేసేవారు, రూ. 10,000 లోన్ కు గాను రూ. 9,000 మాత్రమే ఇచ్చి మళ్ళీ రూ. 10,000 వసూలు చేసేవారు. ఆ పరిస్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ. 10,000 ఇవ్వడం, వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించడం, ఏటా బ్యాంకర్లతో సమావేశమై వారికి అవసరమైన సహాయం చేయడం, రూ. 10,000 ఇచ్చే లోన్ ఇప్పుడు రూ. 13,000 వరకూ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఆ కుటుంబాలన్నీ కూడా మేం గడప గడపకూ వెళ్లినప్పుడు మాకు సంతోషంగా చెబుతున్నాయి, సీఎంగారికి మీ ద్వారా మా ధన్యవాదాలు తెలియజేయమన్నారు, ధ్యాంక్యూ సార్. గతంలో మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది: లక్ష్మీదేవి, చిరువ్యాపారి, అనంతపురం నమస్తే అన్నా, మీతో మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది, నా కలలో కూడా ఊహించలేదు ఇలా మాట్లాడుతానని, అన్నా కరోనా సమయంలో మేం చాలా ఇబ్బందులు పడ్డాం, నేను పూల వ్యాపారం, టైలరింగ్ చేస్తున్నాను, మా ఆయన మెకానిక్‌గా పనిచేస్తున్నారు, మేం ఆ టైంలో రూ. 10 వేలు అప్పు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. రూ. 10 వేలకు వెయ్యి తగ్గించుకుని రూ. 9,000 మాత్రమే ఇస్తామన్నారు, మేం చాలా బాధపడ్డాం, ఆ సమయంలో వలంటీర్ వచ్చి జగనన్న తోడు కార్యక్రమం గురించి చెప్పగానే వెంటనే అప్లై చేశాం, ఎవరి సిఫారసు లేకుండా వెంటనే నా అకౌంట్‌లో రూ. 10 వేలు పడ్డాయి, ఆ తర్వాత నేను తిరిగి సరిగా కట్టడంతో వడ్డీ కూడా వెనక్కి వచ్చింది, నేను ఆశ్చర్యపోయాను, మీరు వచ్చిన తర్వాత వడ్డీ వెనక్కి రావడం చాలా గొప్ప ఆలోచన, ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు, నేను మహిళా సంఘంలో ఉన్నాను, నాకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ కూడా వచ్చింది, మళ్ళీ సంక్రాంతి కానుకగా ఇస్తున్నారు, గతంలో మేం మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది, భారతదేశంలో ఎవరూ కూడా ఇలా చేయలేదు, మీరు మాత్రమే మాకు ఇస్తున్నారు, నాకు 45 సంవత్సరాలు ఉన్నాయని వైఎస్సార్ చేయూతకు కూడా మీరు అర్హులని చెప్పడంతో వలంటీర్ చెప్పడంతో అప్లై చేసుకుంటే నేరుగా రూ. 18,750 నా అకౌంట్‌లోకి వచ్చాయి, ఇది మూడు విడతలు వచ్చింది, ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుంది, ఆ విధంగా నాకు అన్ని పథకాలు కూడా అందుతున్నాయి, మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది, నా కోడలు గర్భవతిగా ఉన్న సమయంలో సీరియస్ అయి ప్రేవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే సిజేరియన్ గురించి రూ. 1.50 లక్షలు ఖర్చవుతుందన్నారు, మేం ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయితే ఆ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు, ఒక్క రూపాయి ఖర్చు కాలేదు, పైగా తిరిగి మా కోడలు అకౌంట్‌కు రూ. 5,000 అన్నలాగా ఇచ్చారు, ఇన్ని ఆలోచనలు మీకెలా వస్తున్నాయి అన్నా, మా అమ్మ ఫించన్ కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగేది, ఇప్పుడు వలంటీర్ వచ్చి ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మకు సంక్రాంతి ముందే వచ్చింది, రూ. 3,000 పెన్షన్ తీసుకుంది, అమ్మ నా పెద్దకొడుకు అని చెబుతుంది, మీరు కులం, మతం, రాజకీయం చూడకుండా గొప్పగా చేస్తున్నారు, మాలాంటి వారంతా ఇంత సంతోషంగా ఉన్నామంటే మీ చలవే, మేం ఇప్పుడు వ్యాపారస్తులుగా గుర్తింపబడ్డాం, మీరు సీఎంగా రావడం మా అదృష్టం, మిమ్మల్ని తిరిగి గెలిపించుకుంటాం, నాకు ఇల్లు కూడా వచ్చింది, గతంలో పేదవాళ్ళని ఎవరూ గుర్తించలేదు, ఈ రోజు మేం బ్యాంకులకు వెళ్ళి ధైర్యంగా కూర్చుని లోన్‌లు అడుగుతున్నామంటే మీరిచ్చిన ధైర్యం, మీరే మళ్ళీ సీఎం కావాలి, మీరు చెప్పినదానికన్నా ఎక్కువే ఇస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు, నమస్తే అన్నా. చావాలో బతకాలో తెలీని పరిస్ధితిని ఎదుర్కున్నాం: అడబాల సత్యవతి, చిరువ్యాపారి, కృతివెన్ను, క్రిష్ణా జిల్లా, మచిలీపట్నం అన్నా నమస్కారం, నాకు ఒక పాప, తను పదో తరగతి చదువుతుంది, నేను పండ్లు తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకునేదానిని, అలాంటి సమయంలో కరోనా వచ్చి మా ఇంటిల్లపాదికి కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం, ఆ సమయంలో వ్యాపారం లేక అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి నానా మాటలంటుంటే చావాలో బతకాలో తెలీని పరిస్ధితిని ఎదుర్కున్నాం, అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు ద్వారా రూ. 10 వేలు ఇచ్చారు, మేం వ్యాపారం చేసే సమయంలో వడ్డీకి రూ. 1000 కి సాయంత్రానికి రూ. 100 చొప్పున వసూలు చేసేవారు, కానీ మేం వ్యాపారం ఎలా చేయాలా అని బాధపడే సమయంలో రూ. 1000 చూసిన ఈ కళ్ళతో రూ. 10,000 చూసేసరికి చాలా సంతోషం వేసింది, ఈ డబ్బుతో నా వ్యాపారం పెంచుకున్నాను, మాకు వడ్డీ భారం లేకుండా తిరిగిస్తున్నారు, సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నాను, బ్యాంకు గుమ్మం ఎక్కని నాకు రూ. 10000 ఇవ్వడం మీ దయే, మళ్ళీ రూ. 11000, ఆ తర్వాత 12000, ఆ తర్వాత 13000 ఇలా ఇచ్చారు, మేం రోడ్డు పక్కన వ్యాపారం చేస్తుంటే చాలా ఇబ్బందులు పెట్టేవారు, కానీ మీరు ఇచ్చిన సాయంతో నేను సొంతంగా షాప్ తీసుకున్నాను, నేను ఓనర్‌గా నిలబడ్డాను అంటే మీ దయే, గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అంటే నమ్మి కట్టడం మానేశాను, ఆ టైంలో వడ్డీ మీద వడ్డీ వేసి నోటీసులు పంపారు, నేను కట్టలేకపోయాను, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నేను మా బంధువుల వద్ద వారిచ్చిన బంగారం తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది, మీరు కట్టండి తర్వాత లోన్ ఇస్తామని, తర్వాత 3 నెలలు లోన్ ఇవ్వలేదు, నేను చాలాసార్లు తిరిగాను, నన్ను గత ప్రభుత్వం చాలా మోసం చేసింది అంటూ కన్నీరు పెట్టుకుంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషంతో కన్నీరు వస్తుంది, ఇది మీ దయ, ఒకప్పుడు చెవిదిద్దులు లేని నేను ఈ రోజు గొలుసు వేసుకున్నానంటే నిజంగా మీ దయవల్లే జగనన్నా, మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామన్నా, ఎందుకున్నా మాకు వేరే సీఎం కావాలి, ఎందుకున్నా మాకు వేరే గవర్నమెంట్, మీరుంటే చాలు అన్నా, మా పాప వచ్చేముందు అమ్మా నువ్వు జగన్‌గారితో మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడమని ముద్దు పెట్టి పంపింది, గతంలో మా పాప సంక్రాంతి సెలవులకు ఊరెళ్ళేది కానీ ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్‌లు చేసి సార్‌లకు పంపాలంట, చదువు చాలా బావుంది, స్కూల్స్ నాడు నేడు ద్వారా చాలా బావున్నాయి, స్కూల్‌కు ఒక పూట మానేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు, ఆరోగ్యం బాలేదంటే మళ్ళీ తగ్గిందా లేదా అని అడుగుతున్నారు. నా భర్తకు హార్ట్‌స్ట్రోక్ వస్తే ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ ఆసుపత్రిలో చూసి పంపారు, మా అమ్మమ్మ విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతుంది, అమె దగ్గర ఎవరూ లేకపోయినా ఆసుపత్రిలో వారే దగ్గరుండి అన్నీ చూసుకుని మందులు ఇచ్చి కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇదంతా ఆరోగ్యశ్రీ వల్లే, మా అమ్మమ్మ జగన్‌గారికి చూపించమని తను వీడియో కూడా పంపమని, ఆవిడ తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నా, అన్నా కాపునేస్తం గురించి చెప్పాలి, ఇంతవరకు ఏ సీఎం కాపు అనేవారిని గుర్తించలేదు, కాపు మహిళలకు సాయం చేస్తున్నారు, నేను రూ. 15,000 తెచ్చుకున్నాను, ఆ డబ్బుతో చీరల వ్యాపారం చేస్తున్నాను, ఇప్పుడు రొటేషన్‌లో రూ. 50వేలకు పెంచగలిగాను, నేను అమ్మ ఒడి తీసుకుంటున్నాను, నా భర్తకు పెన్షన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వచ్చింది, మీ పథకాలు అన్నీ పొందాను, ఇన్ని చేసిన అన్న గురించి చెప్పడానికి నేను తిరుగుతున్నాను, చాలా సంతోషంగా ఉంది, కలెక్టర్ గారి పక్కన కూర్చుని, మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు రుణపడి ఉంటాను జగనన్నా.. ఉదయం లేవగానే జగనన్న ఫోటో చూస్తాం: గౌరి, చిరువ్యాపారి, విజయనగరం జగనన్నా నమస్తే, ఇది కలగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నా భర్తకు చేదోడుగా ఉండాలని ఉండేది, గతంలో మా వీధిలో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి రూ. 10,000 అప్పు ఇచ్చి రూ. 1000 తగ్గించి ఇచ్చేవారు, నూటికి రూ. 10 వడ్డీ కట్టాల్సి వచ్చేది, నేను తీసుకుందాని భయపడ్డాను, మీరు సచివాలయ వ్యవస్ధ పెట్టారు, ఒకప్పుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఏడాది తిరిగాను, కానీ ఇప్పుడు ఏది కావాలంటే అది రెండు రోజుల్లో ఎవరికీ రూపాయి కూడా కట్టకుండా ఇస్తున్నారు, ఇది చాలా బావుంది, నేను మెప్మాలో ఉన్నాను, నేను బ్యాంకులో ఎవరి పూచీకత్తులేకుండా రూ. 10 వేలు తీసుకున్నాను, అన్నీ తిరిగి చెల్లించడంతో వడ్డీ కూడా తిరిగి వచ్చింది, కుట్టుమిషన్ తీసుకుని టైలరింగ్ ప్రారంభించాను, మేం ఇప్పుడు నెలకు రూ. 6,000 పైగా సంపాదిస్తున్నాను, నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చిన ధైర్యం అన్నా, నా భర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మీరు నాకు అన్నలా అన్నీ చూసుకున్నారు, నాకు అమ్మ ఒడి వస్తుంది, ఒకప్పుడు ప్రేవేట్ స్కూల్‌లో సీట్లు లేవనేవారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్ధితి వచ్చింది. ప్రేవేట్ స్కూల్స్ ఖాళీ అయ్యాయి, అమ్మ ఒడి వేస్తున్నారు, విద్యా దీవెన వేస్తున్నారు, మీరు మా నుంచి వచ్చారు కాబట్టి అన్ని పథకాలు ఇస్తున్నారు, మీరు దేవుడిచ్చిన గిఫ్ట్ మాకు, మేం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే భయపడేదాన్ని కానీ ఇప్పుడు మా గ్రూప్ రూ. 10 లక్షలు తీసుకున్నాం, వైయస్ఆర్ సున్నా వడ్డీ వస్తుంది, ఆసరా కింద రూ. 3.60 లక్షలు మా గ్రూప్‌కు వచ్చాయి, అంటే నాకు రూ. 36 వేలు వచ్చాయి, నవరత్నాలలో భాగంగా ఇల్లు కూడా వచ్చింది, ఇప్పుడు అన్నీ అందుతున్నాయి, మా నాన్న గారికి హార్ట్ ఎటాక్ వస్తే రూ. 5 లక్షలు అవుతుందన్నారు, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, నేను బాధపడుతున్న సమయంలో డాక్టర్ రూపంలో మీరు కనిపించారు, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు, వెంటనే ఆపరేషన్ చేశారు, మా నాన్న క్షేమంగా వచ్చారు, అంతేకాకుండా ఏడాది వరకూ మందులు ఫ్రీ, ప్రతినెలా చెకప్ ఫ్రీ, రూ. 3000 మందులు ప్రతి నెలా ఇస్తున్నారు, గతంలో ముసలివారు ఎందుకు బతుకుతున్నామా అని భారంగా బతికేవారు కానీ ఇప్పుడు వారికి పెన్షన్ రాగానే మీరే వారి కొడుకులా భావిస్తున్నారు, మా నాన్న కూడా నేను వచ్చేటప్పుడు జగనన్న నాకు దేవుడన్నారు, ప్రతి ఇంటిలో దేవుడి ఫోటో ఉంటుందో లేదో కానీ మా ఇంట్లో మాత్రం మీ ఫోటో ఉంటుంది, మా నాన్నగారు, నేను ఉదయం లేవగానే మీ ఫోటో చూస్తాం, మీరిచ్చిన పథకాలు లెక్కవేస్తే నేను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలు నేనే లబ్ధిపొందాను, మా అత్తగారికి ఆసరా వచ్చింది, ఆ డబ్బుతో రెండు ఆవులు కొనుక్కుని ఆమె బతుకుతున్నారు, మా మామయ్యకి రైతు భరోసా వచ్చింది, ఏపీలో మీ పథకం అందని ఇల్లంటూ లేదు, ఒక్కొక్కరు నాలుగైదు పథకాలు పొందుతున్నారు, గ్యారెంటీగా ఒక్కొక్కింటికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు లబ్ధిపొందుతున్నారు, ఇంతకంటే ఏం కావాలి అన్నా, నా కొడుక్కి కూడా ఈ ఏడాది ఓటు హక్కు వచ్చింది, ఎవరైనా ఇన్ని పథకాలు అందజేయలేదు, మీరు దేవుడిలా చేశారు, మాకు ఏం కావాలో మీకు తెలుసు, మా కష్టాలన్నీ చూశారు, నవరత్నాలు ఇచ్చారు, మీరు ఇంకా ఉంటే ఏపీ అనేక పథకాలు తీసుకొస్తారు, మీరే మరింత కాలం సీఎంగా ఉంటే ఏపీ వైపు అందరూ చూస్తారు, మీరే మళ్ళీ మళ్ళీ సీఎంగా ఉండాలి, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి, మీ చిరునవ్వుతో ఏపీ వెలిగిపోతుంది, మీరు నిండునూరేళ్ళు ఇలాగే ఉండాలి, మీరు దేవుడిచ్చిన వరం అన్నా, ధన్యవాదాలు.