వైయ‌స్ జ‌గ‌న్ నివాసంలో ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు

బెంగళూరు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. దీపావళి సందర్భంగా నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరించారు. వైయస్‌ జగన్‌, వైయస్‌ భారతి దంప‌తులు ఇంటి ఆవ‌ర‌ణ‌లో బాణసంచా కాల్చి వేడుక‌ల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైయస్‌ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top