రాష్ట్ర వ్యాప్తంగా పెన్ష‌న్ల పండుగ‌

తెల్ల‌వారుజామునుంచి కొనసాగుతున్న వైయ‌స్ఆర్‌  పెన్షన్ల పంపిణీ
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పెన్ష‌న్ల పండుగ జ‌రుగుతోంది. ఇవాళ  తెల్ల‌వారుజామునుంచే వైయ‌స్ఆర్‌  పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం 62.33లక్షల మంది పెన్షనర్లకు రూ.1585.60 కోట్లను విడుదల చేసింది.  వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 57.42 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. 35.79 లక్షల మందికి రూ.908.63 కోట్లు అందజేశారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

Back to Top