కోనసీమ జిల్లా: గోదావరి ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గురువారం బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించారు.