పేదల కళ్ళల్లో ఆనంద‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

డిప్యూటీ స్పీక‌ర్ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి 

 జ‌మ్ము గ్రామంలో 1082 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

విజ‌య‌నగరం: పేదల కళ్ళల్లో ఆనంద‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని డిప్యూటీ స్పీక‌ర్ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయంలో నవరత్నాల్లో భాగంగా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి మాట ఇచ్చిన విధంగా పేదలందరికీ ఇల్లు ఉండాలనే దృఢమైన సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1082 మంది ల‌బ్ధిదారుల‌కు  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గంలో సుమారు 25వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌న్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరికీ ఎప్పుడో గుంకలంలోనో లేదా సారికలోనో లేదా, ఇతర ప్రాంతాల్లో మీకు ఇల్లు పట్ట స్థలాలు ఇచ్చేసేవారు. కానీ మీ కుటుంబ సభ్యులు గానీ, చుట్టుపక్కల ఉన్న బంధువులకు గాని, స్నేహితులకు ఎవరికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే జమ్మూ గ్రామంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌ని తెలిపారు.  జగనన్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంచిపెడతాం అని చెప్పినప్పుడు, ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఈ పని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు చేయలేరు, చేయరు అని హేళన చేసేవారు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి ప‌ట్టా కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, కేవలం మా పార్టీ  మాత్రమే పేదల తరుపున నుంచుని ఇల్లు పట్టాలు ఇస్తుందని, ఇచ్చిన మాట ప్రకారమే చేస్తున్నామని కోలగట్ల అన్నారు.

Back to Top