ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌

విజయవాడ: ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై బురదజల్లుతున్నారని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా విషపురాతలు రాయిస్తున్నాడని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసుకొని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు కాబట్టే టీడీపీని ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్ర‌బాబుకు, టీడీపీ నేతల‌కు బుద్ధిరాలేదని, వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు. 
 

Back to Top