పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడు

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని, రాజకీయాలు మానేసి సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్‌ చేసుకుంటే మంచిదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ప్రజల చేత తిరస్కరించబడిన పవన్‌.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పోల్చుకోకుండా ఉంటే మంచిదన్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజ‌కీయాల గురించి ప‌వ‌న్ ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌ని శ్రేయోభిలాషిగా హిత‌వుప‌లికారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండి.. పాద‌యాత్రతో ప్ర‌తి గ్రామాన్ని సంద‌ర్శించి.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను అవ‌గాహ‌న చేసుకొని.. ప్ర‌జ‌ల బాగు కోసం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుడ‌న్నారు. ద‌య‌చేసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోల్చుకోవ‌ద్ద‌ని పున‌రుద్ఘాటించారు. 

Back to Top