ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో ఆనందం కనిపిస్తోందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సీఎం వైయస్ జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దెందులూరులో వైయస్‌ఆర్ ఆసరా సాయం విడుదల బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొని మాట్లాడారు. అక్కచెల్లెమ్మల కోసం ఇప్పటికే మూడు విడతల్లో వైయస్‌ఆర్ చేయూత, రెండు విడతల్లో వైయస్‌ఆర్ ఆసరా సాయం అందించడం జరిగిందని, నేడు దెందులూరు వేదికగా వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్ ఆసరా సాయాన్ని సీఎం వైయస్ జగన్ విడుదల చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మలంతా సంతోషంగా ఉన్నారంటే, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయంటే అందుకు సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలనే నిదర్శనమన్నారు.