సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌తి ఇంటా వెలుగులు

క‌డ‌ప‌లో `గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం`లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌తి ఇంట్లో వెలుగు నింపాయ‌ని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. క‌డ‌ప న‌గ‌రంలోని 34వ డివిజ‌న్ ఖ‌లీల్ న‌గ‌ర్ ప‌రిధిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరిగి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని, ల‌బ్ధిదారులంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌కర్త‌లు, వ‌లంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top