ఏలూరు: రెండేళ్ల క్రితం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర చరిత్రను, భవిష్యత్తును తిరగరాసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరులోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఆళ్ల నాని ప్రజా సంకల్పయాత్ర రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్‌కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమైఖ్యాంధ్రగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోవడం, ఆ తరువాత ఏపీకి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు అవలంబించిన అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్నారు. అలాంటి సమయంలో ప్రజలందరికీ ఆశాకిరణంలా సీఎం వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది అన్నారు. పాదయాత్రలో వైయస్ జగన్ కోట్లాది మంది ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుంటూ.. సమస్యలను వింటూ అవసరమైన భరోసాను ఇస్తూ చేసిన పాదయాత్ర చరిత్రలో ఎవరూ చేయలేదు.. భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీకి 151 స్థానాలు ఇచ్చారంటే అది వైయస్ జగన్‌పై ఉన్న ప్రగాఢమైన నమ్మకంతోనే అని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ.. సీఎం వైయస్ జగన్ ముందుకుసాగుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపు 90 శాతం పూర్తి చేశారన్నారు. Read Also: సీఎం వైయస్ జగన్ పాదయాత్ర ఒక చరిత్ర