తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్.జగన్ తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ Auguste Tano Koume నేతృత్వంలో బృందం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రపంచబ్యాంకు భారత్ విభాగానికి డైరెక్టర్ Auguste Tano Koume..రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశామన్నారు. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు.. అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.
మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు? అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారని తెలిపారు.
నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు:
దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. మీ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు:
రాష్ట్రంతో మా భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోంది. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుంది:
2047 నాటి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు మా నుంచి కొనసాగుతుంది:
అత్యంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దేశ సగటు కన్నా.. ఎక్కువ: అభివృద్ధిరేటు చాలా బాగుంది. ప్రజలకు మంచి సర్వీసులు అందుతున్నాయి:
డైనమిక్ పారిశ్రామిక రంగం, వైద్య రంగాలు ఉన్నాయి:
సమర్థవంతమైన డైనమిక్ ప్రభుత్వం ఉంది. వరల్డ్ బ్యాంకుతో చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగా కొనసాగుతున్నాయి:
మీరు చేస్తున్న చాలా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి:
ఆరోగ్యరంగంలో టెలిమెడిసన్, ఆన్లైన్ సేవలు, ప్రజలకు చేరువగా వైద్యం, స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలవడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు:
అలాగే విద్యారంగంలో కూడా ప్రపంచబ్యాంకు రాష్ట్రంతో కలిసిపనిచేస్తోంది:
ఈ రంగంలోకూడా మీరు చాలా బాగాపనిచేస్తున్నారు:
ముఖ్యమంత్రిగారు స్ఫూర్తిదాయకులు:
రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని సీఎం తపనపడుతున్నారు:
రాష్ట్రంలో మంచి విధానాలు అమలవుతున్నాయి:
ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న మంచి విధానాలపై మీకు సూచనలు చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం:
ప్రపంచబ్యాంకు బృందాన్ని ఉద్దేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడారు.ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరుతున్నాను:
ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని మేం ఆశిస్తున్నాం:
రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం:
12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం:
6వ తరగతినుంచి ఐఎఫ్పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం:
వచ్చే జూన్ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం:
దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం:
డిజిటలైజేషన్ దిశగా వేస్తున్న పెద్ద అడుగు:
నాడు నేడు కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నాం:
రెండో దశ నాడు నేడు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి:
జీఈఆర్ రేషియోను పెంచుకుంటూ వెళ్లాలన్నదే మా ఉద్దేశం:
ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మేం వచ్చేసరికి దేశ సగటు కన్నా.. తక్కువగా ఉండేది,
ఇప్పుడు దీన్ని అధిగమించాం:
దీనికోసమే స్కూళ్లలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం:
ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీపడలేవన్న మాట వినిపించేది:
రెండేళ్ల తర్వాత.. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడాల్సిన పరిస్థితులు ఉంటాయి:
8 వ తరగతి వారికి ట్యాబులు కూడా ఇస్తున్నాం:
విద్యాభ్యాసాన్ని అత్యంత సులభతరం చేయడానికే ఈ చర్యలు.
అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా బాగా మార్పులు తీసుకువచ్చాం:
మంచి పౌష్టికాహారం, నాణ్యతతో కూడా ఆహారాన్ని అందిస్తున్నాం:
బైలింగువల్ టెక్స్ట్‌బుక్స్, వర్క్ బుక్స్‌ఇస్తున్నాం:
విద్యాకానుకలో భాగంగా డిక్షనరీ ఇస్తున్నాం:
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి ఇస్తున్నాం:
పిల్లల హాజరుతో అనుసంధానం చేసి పథకాన్ని అమలు చేస్తున్నాం:
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి పిల్లాడినీ ట్రాక్ చేస్తున్నాం:
100శాతం ఫీజు రియింబర్స్మెంట్అమలు చేస్తున్నాం, వసతి దీవెన ఇస్తున్నాం:
ఈ కార్యక్రమాలమీద చేసే ఖర్చును.... ఖర్చుగా భావించడంలేదు, పిల్లల మీద పెట్టుబడిగా భావిస్తున్నాం:
విదేశీ విద్యాదీవెన కూడా అమలు చేస్తున్నాం:
సత్యనాదెళ్ల లాంటి వారు మరింత మంది ఆంధ్రప్రదేశ్ నుంచే రావాలన్నది మా ఉద్దేశం.
రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు వస్తున్నాయి. ఈ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులను రాష్ట్రంలోనే తయారవుతాయి:
ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను:
వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశాం:
17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం:
ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్అమలవుతోంది:
ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం:
ఆర్బీకేలు ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం:
వైద్యం, విద్యం, వ్యవసాయం.. ఈమూడు రంగాల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాం:
రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం:
క్షేత్రస్థాయిలో సమస్యలకు.. సమూల పరిష్కారాలను చూపే దిశగా ముందుకు సాగుతున్నాం:
ప్రపంచబ్యాంకు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరుతున్నాను:
కేవలం ఆర్థికంగానే కాకుండా మంచి విధానాలను అమలు చేయడంలో, సాంకేతికంగానూ.. ఇలా తమ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను: