బీసీల పట్ల వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధి చాటుకుంది..

41 సీట్లు కేటాయింపుతో బీసీల రాజకీయ అభ్యున్నతి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌  నేత ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం:41 మంది బీసీలకు వైయస్‌ఆర్‌సీపీ టిక్కెట్లు ఇచ్చి బీసీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుందని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల రాజకీయ అభ్యున్నతిని చేతల్లో చూపించిందన్నారు.బీసీలపై ప్రేమ ఉంటే ఎన్ని స్థానాలు ఇచ్చారో టీడీపీ చెప్పాలన్నారు.కన్నెధార కొండ లీజు అక్రమ కేటాయింపు కాదని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.గిరిజనుల మనోభావాలు గౌరవించాలనే మైనింVŠ  చేపట్టలేదన్నారు.కోర్టు తీర్పు తర్వాత రాజకీయ లబ్ధి కోసం కన్నెధార కొండ లీజు అంశం వాడుకోవడం దిగజారుడుతనమన్నారు.
 

Back to Top