ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే కరోనా వైరస్‌ నివారణ సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.   విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. జనం రద్దీ దృష్ట్యా 14 రైతు బజార్లు 36 చోట్ల ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసర సరుకులు కొనేటప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు.  జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top