ఈనెల 12న ప‌ల్నాడు జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 12వ తేదీన ప‌ల్నాడు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప‌ల్నాడు జిల్లా క్రోసూర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పల్నాడు  జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్థులకు విద్యాకానుక‌ కిట్స్‌ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయల్దేరి తాడేపల్లి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top