సీఎం వైయ‌స్‌ జగన్‌ కడప పర్యటన రద్దు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా పర్యటన ర‌ద్దు అయ్యింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ కడప పర్యటన రద్దు అయిన‌ట్లు సీఎంవో కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇవాళ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. కడప అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాలల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొనాల్సి ఉంది. అలాగే  రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాల్సి ఉంది. ఈ మేర‌కు తాడేప‌ల్లి నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు బ‌య‌లుదేర‌గా దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ కడప పర్యటన రద్దు చేసుకున్నారు. 

Back to Top