రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌...విజయవాడ పర్యటన

జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (20.06.2023) విజయవాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో  ముఖ్యమంత్రి పాల్గొన‌నున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్, ఇంటర్‌ స్టేట్‌ లెవల్‌ టాపర్స్‌ని సత్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top