వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్ జిల్లా పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలోని తన నివాసం నుంచి కడపకు చేరుకున్న సీఎంకు మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాజీవ్‌మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం వైయస్ జగన్ నేటి పర్యటన వివరాలు ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్స్ నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.20 గంటలకు కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.25 నుంచి 10.00 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 10.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు రాజీవ్ మార్గ్ చేరుకుంటారు. 10.20 గంటల వరకు రాజీవ్ మార్గ్ రోడ్డు ప్రారంభోత్సవంలో గడుపుతారు. 10.25కు రాజీవ్ పార్కు చేరుకుంటారు. 10.35 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. 10.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయ లుదేరి 11.00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటలకు అల్ డిక్సన్ యూనిట్‌కు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు. 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు 1.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు.