తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సీఎం సమావేశం కానున్నారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇటీవలే నియోజకవర్గాలకు పరిశీలకులను సీఎం నియమించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.