కూటమి కుట్రలకు “సుప్రీం” చురకలు

పచ్చ మీడియాలో ఆగని తిరుమల లడ్డూ విష ప్రచారం

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామీ..!

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు డాక్ట‌ర్ సాకే శైల‌జ‌నాథ్ 

అనంత‌పురం: తిరుమల లడ్డూ అంశంలో కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన తప్పుడు ప్రచారాలకు సీబీఐ సిట్ నివేదికతో పూర్తిగా తెరపడినా, ఇంకా అదే విష ప్రచారాలను కొనసాగించడం దుర్మార్గమైన చర్యగా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి వర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ తీవ్రంగా ఖండించారు.

కూటమి నేతల దుష్ప్రచారాలకు నిరసనగా శనివారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ, “పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని సీబీఐ సిట్ నివేదికతో స్పష్టమైంది. అయినా నిజాన్ని అంగీకరించకుండా మళ్లీ ఫ్లెక్సీలు, పచ్చ మీడియాతో దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కావాలనే ఈ విష ప్రచారం చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడినీ, దేవాలయాన్నీ కూడా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
“భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. కానీ కూటమి నేతలు ఆ బాధ్యతను విస్మరించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు” అని విమర్శించారు.

తిరుమల లడ్డూ అంశంలో అసత్య ప్రచారాలు పూర్తిగా అబద్ధమని కోర్టు, దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసిన తర్వాత కూడా వాటిని కొనసాగించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. ఇకనైనా కూటమి నేతలు ఇలాంటి దుష్ప్రచారాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top