రాజమండ్రి : వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బయలుదేరారు. హెలీప్యాడ్ వరకూ ప్రజలు, అభిమానులు, మహిళలు, వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ సీఎం వైయస్ జగన్ ముందుకుసాగారు. ఈ సందర్భంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన పలువురి నుంచి విజ్ఙాపనలు స్వీకరించి వారికి భరోసా కల్పించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.