నేడు వైయ‌స్ఆర్ జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మూడు రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

నేటి సాయంత్రం వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం 

2వ తేదీ మ‌హానేత వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద సీఎం నివాళి

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజులపాటు వైయ‌స్ఆర్ జిల్లాలో  పర్యటించనున్నారు. నేటి నుంచి 3వ తేదీవరకు సొంత జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం ప్రారంభించనున్నారు. 2వ తేదీన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధంతి సందర్బంగా ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అదేరోజు పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. 3వ తేదీ ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. 

ముఖ్యమంత్రి పర్యటన సెప్టెంబరు 1న.. 
మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

ముఖ్యమంత్రి పర్యటన 2వ తేదీన..
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. 9 నుంచి 9.40 గంటల వరకు వైయ‌స్ఆర్ ఘాట్‌ వద్ద మ‌హానేత‌కు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 1.30 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 5 గంటల వరకు ఇడుపులపాయలో, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. 5.10 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

ముఖ్యమంత్రి పర్యటన 3వ తేదీన..
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు 9 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తాడేప‌ల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top